‘ప్రేమంటే’ టీజర్ అప్డేట్.. ఇది మీ హృదయాలను దోచుకుంటుందంటూ మేకర్స్ పోస్ట్

by Mallepaka Hamsa |

ఇన్నాళ్లు తన కామెడీతో నవ్వించిన ప్రియదర్శి (Priyadarshi)హీరోగా మారి పలు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు.

‘ప్రేమంటే’ టీజర్ అప్డేట్.. ఇది మీ హృదయాలను దోచుకుంటుందంటూ మేకర్స్ పోస్ట్
X

దిశ, సినిమా: ఇన్నాళ్లు తన కామెడీతో నవ్వించిన ప్రియదర్శి (Priyadarshi)హీరోగా మారి పలు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించిన ఆయన ‘మల్లేశం’ తో హీరోగా మారి ‘బలగం’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. గత కొద్ది కాలంగా హీరోగా రాణిస్తున్న ప్రియదర్శి వరుస హిట్లతో స్టార్ హీరోలకు పోటీగా నిలుస్తున్నాడు. ఇటీవల ‘కోర్టు’ చిత్రంతో హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ప్రియదర్శి ‘ప్రేమంటే’(Premante) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇది ‘థ్రిల్లూ ప్రాప్తిరస్తు’ ట్యాగ్‌లైన్‌తో రాబోతుంది. ఇందులో ప్రియదర్శి సరసన ఆనంది (Anandhi)హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ చిత్రాన్ని నవనీత్ శ్రీరామ్ తెరకెక్కిస్తుండగా.. శ్రీవెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై జాన్వీ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. లవ్, కామెడీ, థ్రిల్లింగ్ అంశాలతో రాబోతున్న ఈ సినిమాకు లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకోగా.. టీజర్ అప్డేట్ ఇచ్చారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ నవంబర్ 2న రాబోతున్నట్లు ప్రకటన చేశారు చిత్రబృందం. ‘‘ఇది మీకు ప్రేమ, నవ్వులు థ్రిల్స్ కోసం సిద్ధంగా ఉండండి. ఇదిమీ హృదయాలను దోచుకుంటుంది’’ అని రాసుకొచ్చారు. అలాగే ప్రియదర్శి ఫ్లోర్ క్లీన్ చేస్తున్న మాప్ పట్టుకుని ఉండగా.. ఆనంది కిటికీలు తలుపులు క్లీన్ చేసే స్ప్రే పట్టుకుని కనిపించింది.

link

Next Story