- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పొట్టు పొట్టు కొట్టుకుంటున్న మొగుడు.. పెళ్లాం.. నవ్వులు, థ్రిల్స్‌తో ఆకట్టుకుంటున్న ‘ప్రేమంటే’ టీజర్
ప్రియదర్శి (Priyadarshi)హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ ప్రేక్షకులకు డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నాడు.

దిశ, సినిమా: ప్రియదర్శి (Priyadarshi)హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ ప్రేక్షకులకు డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నాడు. బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంటూ విభిన్న పాత్రలతో సినీ ప్రియులను ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రస్తుతం ‘ప్రేమంటే’ (premante) సినిమాతో ప్రేమలో పడేసేందుకు సిద్ధమవుతున్నారు. థ్రిల్ ప్రాప్తిరస్తు ట్యాగ్‌లైన్‌తో రాబోతుంది. లవ్, కామెడీ, థ్రిల్లింగ్ అంశాలతో రూపొందుతున్న ఈ చిత్రానికి నవనీత్ శ్రీరామ్(Navaneeth Sriram) దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రియదర్శి సరసన ఆనంది హీరోయిన్‌గా నటిస్తుండగా.. సుమ కనకాల, వెన్నెల కిషోర్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమా బ్యానర్‌పై జాన్వీ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. నవంబర్ 21న థియేటర్స్‌లోకి రాబోతుంది.
ఈ నేపథ్యంలో.. ప్రమోషనల్ కంటెంట్ పెంచే ప్రయత్నంలో భాగంగా చిత్రబృందం అప్డేట్లను షేర్ చేస్తుంది. తాజాగా, మూవీ మేకర్స్ ‘ప్రేమంటే’ టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో ఆనంది, ప్రియదర్శి భార్యభర్తలుగా నటించారు. థ్రిల్స్, కామెడీ నేపథ్యంలో.. జనాలను నవ్విస్తోంది. పొట్టు పొట్టు కొట్టుకోవడానికే ప్రియదర్శి, ఆనంది పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత అన్ని గొడవలతో మొదలైన వీరి కాపురంలోకి ఓ లేడీ కానిస్టేబుల్ సుమ ఎంటర్ అవుతుంది. చిలకా గోరింకల్లా ఉన్న జంటలకు విడాకులు ఇప్పటించడంలో ఆమె దిట్ట. ఇక వెన్నెల కిషోర్ కామెడీ అదిరిపోయింది. అంతటితో టీజర్ పూర్తి అవగా.. ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.






