ఓటీటీలో దూసుకుపోతున్న అనసూయ.. 50 మిలియన్ల వ్యూస్‌తో టాప్‌లోకి

by Chukka Sudharani |

ప్రతిష్టాత్మక సినీ నిర్మాణ సంస్థ జీ5 రూపొందించిన సినిమా ‘ప్రేమ విమానం’.

ఓటీటీలో దూసుకుపోతున్న అనసూయ.. 50 మిలియన్ల వ్యూస్‌తో టాప్‌లోకి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతిష్టాత్మక సినీ నిర్మాణ సంస్థ జీ5 రూపొందించిన సినిమా ‘ప్రేమ విమానం’. ఇద్దరు పిల్లల భావోద్వేగాలతో సాగే ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు. ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. చిన్న సినిమాగా ఓటీటీ లోకి వచ్చిన ఈ చిత్రం రికార్డు స్థాయిలో వ్యూస్ సాధిస్తుంది. కాగా.. అనసూయ భరధ్వాజ్, సంగీత్ శోభన్, శాన్వి మేఘన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీకి సంతోష్ కాటా దర్శకత్వం వహించాడు.

Next Story