- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రేమ విమానం మూవీ ట్విట్టర్ రివ్యూ.. అనసూయ మూవీకి అదిరిపోయే రెస్పాన్స్
ప్రేమ విమానం మూవీ నేడు జీ 5 లో స్ట్రీమ్ అవుతుంది.

దిశ,వెబ్ డెస్క్: ప్రేమ విమానం మూవీ నేడు జీ 5 లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ 1990 లో జరిగిన పీరియాడిక్ ఎమోషనల్ డ్రామా అని చెప్పొచ్చు. సంగీత్ శోభన్, శాన్వీ మేఘన , అనసూయ ముఖ్య పాత్రల్లో నటించారు. కథ విషయానికొస్తే..
అనసూయ భర్త అప్పులు చేస్తుంటాడు.. వాటిని ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్య చేసుకుంటాడు. కటిక పేదరికంలో అనసూయ కుటుంబాన్ని అతికష్టం మీద పోషిస్తుంది. ఆమె ఇద్దరు కుమారులకు విమానం అంటే పిచ్చి. ఒక్కసారైనా ఎక్కాలనే ఆశ. మరోవైపు సంగీత్ శోభన్, శాన్వీ మేఘన ప్రేమ కథ నడుస్తుంది. ఇంట్లో వాళ్ళు బయట సంబంధాలు చేస్తున్న క్రమంలో ఇద్దరూ దుబాయ్ పారిపోవాలి అనుకుంటారు. అనసూయ దాచుకున్న డబ్బులతో పిల్లలు విమానం ఎక్కాలని పారిపోతారు. ఈ రెండు కథలకు ఇంటర్ లింక్ ఏంటి? విమానం ఎక్కాలన్న పిల్లల కోరిక తీరిందా? సంగీత్-శాన్వీ దుబాయ్ పారిపోయి పెళ్లి చేసుకున్నారా ? లేదనేది తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే..!
ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు మంచి సినిమా, పక్కా ఎంటర్టైన్మెంట్, క్లైమాక్స్ లో ఎమోషన్ సీన్స్ అయితే.. సూపర్ డూపర్ అంటూ ట్విట్టర్ వేదికగా వారి అభిప్రాయాన్ని ట్వీట్ చేసి తెలుపుతున్నారు.






