- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్.. కోరికను కంట్రోల్ చేసుకోలేకపోయానంటూ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ హీరోయిన్ రెజీనా కాసండ్రా(Regina Cassandra) ‘శివ మనసులో శృతి’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ రెజీనా కాసండ్రా(Regina Cassandra) ‘శివ మనసులో శృతి’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించిన ఆమె భాషతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్ట్స్ చేసింది. ఇక గత ఏడాది ‘ఉత్సవం’తో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం బ్లాక్ బస్టర్ హిట్ సీక్వెల్ ‘అమ్మను-2’ పనుల్లో ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. ఈక్రమంలో.. తాజాగా, ఓ షోలో పాల్గొన్న రెజీనా తను ప్రెగ్నెంట్ అయినట్లు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
ఇటీవల శ్రీముఖి హోస్ట్ చేస్తున్న చెఫ్ మంత్ర షోలో పాల్గొని షాకింగ్ విషయాలు చెప్పింది. ‘‘ఫుడ్ అనేది నా కోసం ఓ అడ్వెంచర్‌లా ఉంటుంది. ఏం తినాలో, ఎంత తినాలో, ఎప్పుడు తినాలో నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. బెంగళూరులో ఉన్నప్పుడు ఒక రాత్రి తనకు చాలా ఇష్టమైన "మిష్టి దోయ్" (Bengali Sweet) తినాలని బాగా అనిపించిందట. దానికోసం ఎన్నో స్వీట్ షాపులు తిరిగిందట. కానీ, ఎక్కడా దొరకలేదని చెప్పింది. చివరికి ఒక షాప్‌లో ఆ స్వీట్ కనిపించినా అప్పటికే షాప్ మూసే టైమ్ అయిపోయింది. సేల్స్ బాయ్ ‘ఇప్పుడే షాప్ క్లోజ్ అయిపోయింది, సర్వ్ చేయలేం’ అన్నారు.
దీంతో ఏం చేయాలో అర్థం కాక.. నేను ప్రెగ్నెంట్ ఈ స్వీట్ తినాలని చాలా కోరికగా ఉందని చెప్పా. వెంటనే జాలిపడిన షాక్ కీపర్ వెళ్లి తీసుకోండి అనడంతో డబ్బులు ఇచ్చేసి వెళ్లిపోయాను. ఆ తర్వాత నా ఫ్రెండ్స్ అంతా ఎందుకలా చెప్పావని షాక్ అయ్యారు. కానీ నాకు చాలా చాలా క్రేవింగ్స్ వచ్చాయి.. తినాలనిపించింది కంట్రోల్ చేసుకోలేకపోయాను. అందుకే మిష్టి దోయ్ స్వీట్ కోసం అలా చెప్పాల్సి వచ్చింది’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.






