ప్రభాస్‌పై మనసుపడ్డ కన్నప్ప బ్యూటీ.. ఓ డ్రీమ్‌లా ఫిలయ్యానంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |

యంగ్ హీరోయిన్ ప్రీతి ముకుందన్(Preethi Mukundan) ‘ఓం భీమ్ బుష్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.

ప్రభాస్‌పై మనసుపడ్డ కన్నప్ప బ్యూటీ.. ఓ డ్రీమ్‌లా ఫిలయ్యానంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ ప్రీతి ముకుందన్(Preethi Mukundan) ‘ఓం భీమ్ బుష్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద హిట్ సాధించనప్పటికీ ప్రీతి ముకుందన్ నటనకు బాగానే మార్కులు పడ్డాయి. దీంతో వెంటనే భారీ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’(Kannappa) మూవీలో అవకాశం అందుకుంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మంచు విష్ణు సరసన ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటించింది. మోహన్ బాబు భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), మోహన్ లాల్, అక్షయ్ కుమార్(Akshay Kumar), కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం వంటి స్టార్స్ కీలక పాత్రలో కనిపించారు.

అయితే ఈ సినిమా జూన్ 27న థియేటర్స్‌లో విడుదలై మిక్స్‌డ్ టాక్‌ను అందుకుంది. అయినప్పటికీ ప్రీతి ముకుందన్‌కు వరుస అవకాశాలు వస్తున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల చిత్రాలో చాన్స్ కొట్టేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రీతి ముకుందన్ డార్లింగ్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ‘‘కొన్న అవకాశాలు మన కృషితో కాకుండా అదృష్టంతో వస్తాయి. నాకు ‘కన్నప్ప’ సినిమాలో అవకాశం అనుకోకుండా వచ్చింది. చాన్స్ వచ్చాక దాన్ని ఎలా వినియోగించెకోలనేది మనమే నిరూపించుకోవాల్సి ఉంటుంది. నాకు సవాళ్లతో కూడిన పాత్రలంటే చాలా ఇష్టం అవే నాకు గుర్తింపు వచ్చేలా చేశాయి. ‘కన్నప్ప’లో ప్రభాస్ గారితో కలిసి పని చేయడం నిజంగా ఒక డ్రీమ్‌లా ఫీలయ్యా.

ఆయన షూటింగ్ సెట్‌లో అందరినీ గౌరవంగా చూస్తారు. ఎవ్వరినీ తక్కువ అంచనాతో చూడరు. అందరితో చాలా స్నేహంగా, గౌరవంగా మాట్లాడుతారు. ఆయన ఉన్నచోట పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. స్క్రీన్‌పైనై కాకుండా రియల్ లైఫ్‌లోనూ ఓ మ్యాజిక్ ఉంటుంది. ప్రభాస్ మంచితనానికి నేను ఫిదా అయిపోయా’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు మంచువిష్ణుతో చేసావ్ అంత పెద్ద ప్రాజెక్ట్ దొబ్బింది.. ఇప్పుడు నీ కన్ను మా అన్నపై పడిందా తల్లి వదిలేయి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Next Story