- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యాక్షన్ కింగ్‌తో ప్రీతి ముకుందన్ బ్లాస్టింగ్ కాంబో.. ఫస్ట్ లుక్ విడుదల
ప్రీతి ముకుందన్ యాక్షన్ కింగ్ అర్జున్ సర్జాతో కలిసి నటించే అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో మారుమోగుతోంది. విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’తో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ, ఆ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ క్రేజీ ఆఫర్లు అందుకుంటూ ఫుల్ ఫామ్‌లో ఉంది. ఈ క్రమంలో, తాజాగా ఆమె యాక్షన్ కింగ్ అర్జున్ సర్జాతో కలిసి నటించే అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. చాలా కాలంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా అలరిస్తున్న అర్జున్ సర్జా, ఇప్పుడు మళ్ళీ తన మార్క్ యాక్షన్ హీరోగా మారబోతున్నారు. ప్రదీప్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన యువ దర్శకుడు సుభాష్ కె ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ AGS ఎంటర్‌టైన్‌మెంట్ దీనిని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమాకు ‘బ్లాస్ట్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో అర్జున్ సరసన సీనియర్ నటి అభిరామి నటిస్తుండగా, ప్రీతి ముకుందన్ అర్జున్ కూతురి పాత్రలో కనిపిస్తోంది. ఇది కేవలం యాక్షన్ సినిమా మాత్రమే కాకుండా, తండ్రీకూతుళ్ల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ చుట్టూ తిరిగే సెంటిమెంట్ డ్రామాగా రూపొందుతోంది.
ప్రీతి పాత్రకు ఈ కథలో చాలా ప్రాముఖ్యత ఉందని సమాచారం. విడుదలైన ‘బ్లాస్ట్’ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఈ పోస్టర్‌లో అర్జున్ ఒక పెద్ద కత్తితో చాలా మాస్ లుక్‌లో కనిపిస్తుండగా, అభిరామి చేతిలో పెద్ద సుత్తి పట్టుకుని ఎంతో కోపంగా చూస్తోంది. ఇక ప్రీతి ముకుందన్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ కరాటే భంగిమలో కనిపిస్తోంది. వీరి చుట్టూ విలన్లు దెబ్బలు తిని పడి ఉన్న విజువల్స్ చూస్తుంటే, సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ ఉన్నాయని అర్థమవుతోంది. "బ్లాస్ట్ చేయడానికి అన్నీ సిద్ధంగా ఉన్నాయి.. త్వరలోనే థియేటర్స్‌లోకి రాబోతున్నాము" అంటూ ప్రీతి సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. ‘కన్నప్ప’ తర్వాత ప్రీతి ముకుందన్ ఈ సినిమాతో మరో భారీ విజయాన్ని అందుకోవడం ఖాయమని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు. అంతేకాకుండా పోస్టర్ చూస్తేనే పూనకాలు వచ్చేలా ఉంది? ఇందులోని యాక్షన్ సీన్స్ ఎలా ఉంటాయో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






