- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘనంగా జరిగిన ‘రారా పెనిమిటి’ ప్రీ రిలీజ్ ఈవెంట్
భర్త రాక కోసం భార్య పడే విరహ వేదన నేపథ్యంలో సింగిల్ క్యారక్టర్‌తో రూపొందిన చిత్రం ‘రారా పెనిమిటి’.

దిశ, సినిమా : భర్త రాక కోసం భార్య పడే విరహ వేదన నేపథ్యంలో సింగిల్ క్యారక్టర్‌తో రూపొందిన చిత్రం ‘రారా పెనిమిటి’. నందిత శ్వేత ప్రధాన పాత్రలో శ్రీ విజయానంద్ పిక్చర్స్ బ్యానర్‌పై శ్రీమతి ప్రమీల గెద్దాడ నిర్మించగా సత్య వెంకట గెద్దాడ దర్శకత్వం వహించాడు. త్వరలో విడుదల కానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం ఘనంగా జరిగింది. ఈ మేరకు మాట్లాడిన మణిశర్మ.. ‘ఒక మంచి కథతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాం. నేను ఇంతవరకు చేసిన కంపోజిషన్‌లో నాకు ఇష్టమైన పాటలు ఇందులో ఉన్నాయి. తప్పకుండా ఈ సినిమా బిగ్ హిట్ అవుతుంది’ అన్నారు. అలాగే సింగిల్ క్యారక్టర్ అనగానే మొదట భయపడ్డానన్న నందిత.. సాహసమే అయినా ఈ మూవీ చేయడం తన అదృష్టమని చెప్పింది. చివరగా సత్య వెంకట గెద్దాడ, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు, నటుడు రాంకీ, హరిణి మాట్లాడుతూ చిత్రాన్ని పెద్ద సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నామన్నారు.






