- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అవును నిహారికను వదిలేసి చాలా రోజులైంది: స్టార్ సింగర్
ప్రముఖ సింగర్ ప్రతీక్ కుహాద్ తన ప్రేయసి, నటి నిహారిక ఠాకూర్‌తో విడిపోయినట్లు తెలిపాడు.

X
దిశ, సినిమా : ప్రముఖ సింగర్ ప్రతీక్ కుహాద్ తన ప్రేయసి, నటి నిహారిక ఠాకూర్‌తో విడిపోయినట్లు తెలిపాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడూ తనకు సంబంధించిన విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటూనే ఉండే ఆయన.. తాజా ఇంటరాక్షన్‌లో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. నిజానికి తాము ఎప్పుడో విడిపోయామని, కొంతకాలంగా పెద్దగా మాట్లాడుకోలేదని చెప్పాడు. 'నేను కొంతకాలంగా ఎవరితో సంబంధంలో లేను. గతంలో జరిగిన విషయాలన్నీ ముగిశాయి. ఒంటరిగానే ఉన్నాను. కానీ బాగున్నాను. ఈ బంధం ముగిసిన తర్వాతే బాగా పని చేస్తున్నా. సంగీతం మరింత మెరుగ్గా వాయించడంపై దృష్టి పెడుతున్నా' అని తెలిపాడు. కాగా గతంలో ప్రియురాలితో కలిసి గిటారు వాయించే వీడియోలు పోస్ట్ చేసే ప్రతీక్.. ఈ మధ్య ఒంటరిగా గిటార్ ప్లే చేస్తున్న వీడియోస్ పెట్టడంపై చర్చ జరగడంతో స్పందించాల్సి వచ్చింది.
Next Story






