‘మహాకాళి’ నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ.. పవర్ ఫుల్ పోస్టర్‌ విడుదల

by Mallepaka Hamsa |

‘హనుమాన్’ సినిమాతో బాక్సాఫీసును షేక్ చేసిన ప్రశాంత్ వర్మ (Prashanth Verma)గత కొద్ది కాలంగా సైలెంట్‌గా ఉంటున్నారు.

‘మహాకాళి’ నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ.. పవర్ ఫుల్ పోస్టర్‌ విడుదల
X

దిశ, సినిమా: ‘హనుమాన్’ సినిమాతో బాక్సాఫీసును షేక్ చేసిన ప్రశాంత్ వర్మ (Prashanth Verma)గత కొద్ది కాలంగా సైలెంట్‌గా ఉంటున్నారు. ఇంతకుముందే.. ‘జాంబి రెడ్డి, కల్కి వంటి చిత్రాలు చేసినప్పటికీ ‘హనుమాన్’ ప్రపంచవ్యాప్తంగా ఎంతగానో పాపులారిటీ దక్కించుకున్నారు. ప్రస్తుతం హనుమాన్ సీక్వెల్ తెరకెక్కించడంతో పాటు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌ నుంచి రాబోతున్న మూడో ప్రాజెక్ట్ ‘మహాకాళి’ (Mahakali)పనుల్లో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. దీనికి ప్రశాంత్ వర్మ కథ అందిస్తుండగా.. పూజ అపర్ణ(Pooja Aparna) కొల్లూరు దర్శకత్వం వహించనున్నారు.

ఆర్. కె. దుగ్గల్ సమర్పణలో రివాజ్ దుగ్గల్ నిర్మించబోతున్నారు. ఈ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతం అందిస్తున్నారు. ఇక ‘మహాకాళి’ సినిమాలో అక్షయ్ ఖన్నా శుక్రాచార్యుడిగా నటిస్తున్నాడు.షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ ప్రకటిస్తూ.. ప్రశాంత్ వర్మ ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. తాజాగా, ‘మహాకాళి’ సినిమా నుంచి బిగ్ అప్డేట్ రాబోతున్నట్లు ప్రశాంత్ వర్మ ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు.

అక్టోబర్ 30న ఉదయం 10:08 గంటలకు ఫస్ట్ లుక్ పోస్టర్ రాబోతున్నట్లు తెలిపాడు. ఓ పవర్ ఫుల్ ఫొటోతో షేర్ చేసి అందరిలో అంచనాలను రెట్టింపు చేశాడు. అసలు అందులో ఏముందంటే.. మొత్తం బంగారు గాజులు ధరించి ఉన్న మహిళ చేతికి రక్తం అంటుకుని ఉండగా.. మట్టిలోంచి ఒక రాడ్‌ను పట్టుకున్నట్లుగా కనిపించింది. ప్రస్తుతం ఈ పోస్టర్ అందరిలో క్యూరియాసిటీని పెంచుతోంది. అలాగే మహాకాళి పాత్రలో నటిస్తున్న హీరోయిన్ ఎవరా అని తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

link

Next Story