ఇద్దరు ఒక్కడే.. రిలీజ్‌కు ముందే రివీల్ చేసిన నీల్ మావా?

by Disha Web Desk 9 |
ఇద్దరు ఒక్కడే.. రిలీజ్‌కు ముందే రివీల్ చేసిన నీల్ మావా?
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘సలార్’ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబరు 22 న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. డార్క్ సెంట్రిక్ థీమ్‌తో వస్తోన్న ఈ చిత్ర ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి నెట్టింట.. ట్రైలర్‌లో మనం చూస్తున్నది దేవాని, అసలైన సలార్ సెకండ్ పార్ట్ లో ఉంటాడు. సెకండ్ పార్ట్‌కు లీడ్ ఇస్తూ సలార్ మొదటి భాగం ఎండింగ్‌లో వస్తాడు” అంటూ జోరుగా చర్చ జరుగుతుంది. అయితే మోస్ట్ వయొలెంట్ మ్యాన్ సలార్ కొడుకు దేవానే ఇలా ఉంటే.. ఇక సలార్ వస్తే ఎలా ఉంటుందో అంటూ రెబల్ స్టార్ ఫ్యాన్స్‌కు భారీ అంచనాలు పెంచాడు నీల్. ఈ విషయంలో డిసెంబర్ 22న క్లారిటీ వస్తుందనుకుంటే విడుదల కంటే ముందే ఇద్దరూ ఒకడే అని తాజాగా ప్రశాంత్ నీల్ రివీల్ చేసి, అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చాడు. ఈ చిత్రంలో సలార్, దేవా వేరు వేరు కాదు ఇద్దరూ ఒకడేనని దర్శకుడు చెప్పడంతో.. రిలీజ్ ముందే రివీల్ చేసేసావ్ ఏంటి మావా? అంటూ సినీ అభిమానులు సోషల్ మీడియాలోపెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.

Next Story

Most Viewed