- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సినీ ప్రియులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ.. పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prasanth Verma) ‘హనుమాన్’ సినిమాతో బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించాడు.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prasanth Verma) ‘హనుమాన్’ సినిమాతో బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించాడు. ఒక్క చిత్రంతో తన క్రేజ్‌ను మరింత పెంచుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ తెరకెక్కిస్తున్నాడు. అలాగే తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఏడాది ఒక్క చిత్రాన్ని తీసుకురాబోతున్నట్లు ఇటీవల ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా, ప్రశాంత్ వర్మ సినీ ప్రియులకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. తన సినిమాటిక్ యూనివర్స్‌లోంచి రాబోతున్న భారీ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు. ఈ మూవీకి ‘అధీర’ (ADHIRA )అనే పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేయగా.. ఇందులో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య కుమారుడు దాసరి కళ్యాణ్(Dasari Kalyan) హీరోగా నటిస్తున్నాడు. నటుడిగా ఇదే అతని మొదటి చిత్రం కావడం విశేషం.
అలాగే ఇందులో ఎస్‌జే సూర్య (SJ Surya)కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతుండగా.. ఆర్‌కేడీ స్టూడియోస్ బ్యానర్‌పై రివాజ్, రమేశ్ దుగ్గల్ నిర్మిస్తున్నారు. ప్రశాంత్ వర్మ సూపర్ విజన్‌తో రాబోతున్న ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. ఇక విడుదలైన పోస్టర్‌లో అగ్నిపర్వతం బద్ధలైనట్లుగా కనిపిస్తుండగా.. అందులో కళ్యాణ్ సూపర్ హీరో గెటప్‌లో ఉండగా.. వెరైటీ లుక్‌లో ఎస్ జే సూర్య ఉన్నాడు. ఇక ఈ పోస్ట్‌కు ‘‘ప్రపంచాన్ని చీకటి కమ్మేసినప్పుడు.. ఆశాకిరణం వెలుగులా పుట్టుకొస్తుంది’’అనే ఆసక్తికర క్యాప్షన్ జత చేశాడు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. దీంతో ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.






