- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కంగనాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ప్రకాష్ రాజ్.. మొరగడం మొదలెట్టారంటూ షాకింగ్ కామెంట్స్
ఆస్కార్ విన్నర్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ (AR Rahman)బాలీవుడ్‌లో తనపై మతపరమైన వివక్ష జరుగుతోందని చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.

దిశ, సినిమా: ఆస్కార్ విన్నర్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ (AR Rahman)బాలీవుడ్‌లో తనపై మతపరమైన వివక్ష జరుగుతోందని చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. దీనిపై కంగనా స్పందిస్తూ.. రెహమాన్ అత్యంత పక్షపాతి అని, ‘ఎమర్జెన్సీ’ కథ వినడానికి కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని విమర్శించింది. ఈ సంఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా, ఏఆర్ రెహమాన్, బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut)మధ్య నెలకొన్న వివాదంపై ప్రకాష్ రాజ్ స్పందించిన తీరు ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో సెన్సేషన్‌గా మారింది. ఇటీవల కేరళ లిటరేచర్ ఫెస్టివల్‌లో పాల్గొన్న ప్రకాష్ రాజ్, రెహమాన్‌కు అండగా నిలుస్తూ కంగనాకు గట్టి కౌంటర్ ఇచ్చాడు. ‘‘జై హో, మా తుజే సలాం వంటి పాటలతో దేశభక్తిని చాటిన రెహమాన్ ఆస్కార్ తెచ్చినప్పుడు మీరంతా పండగ చేసుకున్నారు.
ఇప్పుడు ఆయన తన మనసులోని నిజాన్ని చెబితే సహించలేకపోతున్నారు. ఆయన మీ దగ్గర పని కోసం అడుక్కోవడం లేదు, ఆ స్థాయిని ఎప్పుడో దాటేశారు" అంటూ ప్రకాష్ రాజ్ (Prakash Raj)ఘాటుగా విమర్శించారు. కంగనా తన 'ఎమర్జెన్సీ' సినిమాకు రెహమాన్ సంగీతం ఇవ్వలేదన్న ఆరోపణలపై ప్రకాష్ రాజ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘ఒక నటి తన సినిమాకు పని చేయలేదని ఆయన్ని దేశద్రోహి అని పిలవడం హాస్యాస్పదం. కంగనా తన 'ఎమర్జెన్సీ'ని ఒక క్లాసిక్ అని చెప్పుకుంటోంది, కానీ అది కేవలం ఒక ప్రాపగాండా సినిమా. అందుకే రెహమాన్ ఆ ప్రాజెక్ట్‌ను తిరస్కరించారు. ఆయన ఒక నిజం మాట్లాడగానే కొందరు మొరగడం మొదలుపెట్టారు’’ అంటూ కంగనాను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ప్రకాష్ రాజ్ జోక్యంతో ఈ వివాదం సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది.






