- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముగ్గురు భామల మధ్యలో ప్రజాపతి పాండే.. థియేటర్స్‌లోకి రకుల్ ప్రీత్ సింగ్ క్రేజీ కామెడీ ఎంటర్‌టైనర్!
రకుల్ ప్రీత్ సింగ్ పాత్ర అత్యంత కీలకంగా వినోదాత్మకంగా ఉండబోతోందని సమాచారం. సారా అలీ ఖాన్, వామికా గబ్బీలతో పాటు రకుల్ కూడా తనదైన శైలిలో ఆయుష్మాన్‌ను ముప్పతిప్పలు పెట్టే పాత్రలో మెరవనుంది.

దిశ, సినిమా: బాలీవుడ్‌లో వినోదానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ‘పతీ పత్నీ ఔర్ వో’ ఫ్రాంచైజీ నుండి మరో క్రేజీ సీక్వెల్ సిద్ధమైంది. ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘పతీ పత్నీ ఔర్ వో 2’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రంలో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్, గ్లోబల్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఒక కీలక పాత్రలో నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా ‘ప్రజాపతి పాండే’ అనే పాత్రలో కనిపిస్తుండగా, ఆయన చుట్టూ ముగ్గురు అందాల భామలు తిరుగుతుంటారు. వారిలో రకుల్ ప్రీత్ సింగ్ పాత్ర అత్యంత కీలకంగా వినోదాత్మకంగా ఉండబోతోందని సమాచారం. సారా అలీ ఖాన్, వామికా గబ్బీలతో పాటు రకుల్ కూడా తనదైన శైలిలో ఆయుష్మాన్‌ను ముప్పతిప్పలు పెట్టే పాత్రలో మెరవనుంది. రకుల్ గత సినిమాల్లో తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఆయుష్మాన్ సరసన ఆమె చేసే అల్లరి థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించడం ఖాయం.
విడుదలైన పోస్టర్ సినిమాలోని థీమ్‌ను కళ్ళకు కట్టినట్లు చూపిస్తోంది. ఇందులో ఆయుష్మాన్ ఖురానా ఒక వలలో చిక్కుకుపోయి ఉండగా, రకుల్ ప్రీత్ సింగ్, మిగిలిన ఇద్దరు హీరోయిన్లు ఆ వలను పట్టుకుని పైనుండి నవ్వుతూ చూస్తున్నారు. "వేటగాడే వేటగా మారాడు అనే క్యాప్షన్‌తో ఈ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ముగ్గురు భామల ప్రేమలో చిక్కుకున్న ప్రజాపతి పాండే ఎలా బయటపడతాడు అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం. పోస్టర్‌లో ఆయుష్మాన్ పక్కన ఒక చిరుతపులి ఉండటం చూస్తుంటే, కామెడీతో పాటు కాస్త అడ్వెంచర్ కూడా ఉంటుందని అర్థమవుతోంది. ఈ చిత్రానికి ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వహిస్తున్నారు. మొదట ఈ సినిమా మార్చి నెలలో విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, కొన్ని సాంకేతిక కారణాల వల్ల రిలీజ్ డేట్‌ను మే 15, 2026కి మార్చారు. టీ-సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2019లో వచ్చిన కార్తీక్ ఆర్యన్ మూవీ ఎంతటి విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయుష్మాన్ ఖురానా, రకుల్ ప్రీత్ సింగ్ ల కాంబినేషన్ ఈ సీక్వెల్‌ను అంతకు మించి నిలబెడుతుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
మెరిసే గోల్డ్ కలర్ డ్రెస్‌లో సెగలు రేపుతున్న బాలయ్య హీరోయిన్






