నటుల మనస్తత్వాలను కొవిడ్ పూర్తిగా మార్చేసింది: బోల్డ్ బ్యూటీ

by Disha Web Desk 7 |
నటుల మనస్తత్వాలను కొవిడ్ పూర్తిగా మార్చేసింది: బోల్డ్ బ్యూటీ
X

దిశ, సినిమా: హాట్ బ్యూటీ ప్రజక్తా దుసానే.. కరోనా మహమ్మారి కారణంగా మనుషుల మనస్తత్వాలు మారాయంటోంది. అంతేకాదు తన అప్ కమింగ్ వెబ్ షో చిత్రీకరణ కోసం ఉత్తరప్రదేశ్‌ రాబోతున్నందుకు ఉత్సాహంగా అనిపిస్తుందని చెప్పింది. రీసెంట్ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. '2023 నాకు మంచి ప్రారంభం. నేను మహ్మద్ షరియా సరసన నటించేందుకు ఓ వీడియో షూట్ కోసం అమ్రోహాకు వెళ్తున్నా. దీని తర్వాత జనవరిలోనే నా తదుపరి వెబ్ సిరీస్ షూటింగ్ ఉత్తరప్రదేశ్‌లో ప్రారంభమవుతుంది.

ప్రస్తుతం అదే ప్రాజెక్ట్ కోసం వర్క్‌షాప్‌లో పొల్గొంటున్నా. పరిశ్రమలో చేరి ఏడేళ్లు అయింది. ఇప్పుడు పరిస్థితులు చాలా మెరుగ్గా ఉన్నాయి. మోడలింగ్ నుంచి ఇండస్ట్రీకి వచ్చినప్పుడు సినిమా, సీరియల్స్ మాత్రమే చేయాలనుకున్నా. కానీ, ఈ రోజు వెబ్ సిరీస్ ఆఫర్ వరించడం లక్కీగా భావిస్తున్నా. కొవిడ్ టైమ్ నుంచి నటీనటుల ఆలోచన ధోరణి మారింది. అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కపిల్ శర్మ షోలో పాల్గొనడం నాకు చాలా గుర్తింపునిచ్చింది. దీంతో విభిన్న ప్రాజెక్ట్‌లు చేయగలుగుతున్నా' అంటూ హ్యాపీగా ఫీల్ అయింది.

ఇవి కూడా చదవండి : ఈ విషయం మీతో పంచుకోవడానికి ఆగలేకపోతున్నా: Tamannaah



Next Story