- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’ సినిమాలో స్టార్ హీరో కీ రోల్.. హైప్ పెంచుతున్న ట్వీట్
కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) ‘లవ్ టుడే’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు.

దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) ‘లవ్ టుడే’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు. ఇక ఇటీవల ‘డ్రాగన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ అయిపోయాడు. ప్రదీప్ రంగనాథన్ నటిస్తున్న చిత్రాల్లో ‘డ్యూడ్’(Dude) ఒకటి. కీర్తిశ్వరన్(Keerthiswaran) దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీలో మమిత బైజ్ హీరోయిన్‌గా నటిస్తోంది. రొమాంటిక్ యాక్షన్ కామెడీ జానర్‌తో రాబోతున్న ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదల కాబోతుంది.
ఇప్పటికే ఇందులోంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకుల్లో మంచి రెస్సాన్స్‌ను దక్కించుకోగా.. ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా? అని సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో.. తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ‘డ్యూడ్’ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్(Siva Karthikeyan) గెస్ట్ రోల్ చేయనున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ ఇందుకు సంబంధించిన పోస్టులు మాత్రం ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతున్నాయి.






