మెగాఫోన్ పట్టనున్న ప్రదీప్ రంగనాథన్.. రిస్క్ అవసరమా అంటూ నెటిజన్ల కామెంట్స్

by Mallepaka Hamsa |

కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan)వెండితెరపై దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

మెగాఫోన్ పట్టనున్న ప్రదీప్ రంగనాథన్..  రిస్క్ అవసరమా అంటూ నెటిజన్ల కామెంట్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan)వెండితెరపై దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఇందులో రవి మోహన్ కథానాయకుడిగా.. నటించినఈ చిత్రం ఘన విజయం సాధించడంతో ప్రదీప్ రంగనాథన్‌కు భారీ ఫేమ్ వచ్చింది. దీంతో వెంటనే హీరోగగా మారిన ఆయన స్వీయ దర్శకత్వంలో ‘లవ్‌టుడే’ సినిమా చేశాడు. యూత్‌ఫుల్ లవ్ స్టోరీ నేపథ్యంలో.. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సంచలన విషయాన్ని సాధించింది. ఆ తర్వాత ప్రదీప్ రంగనాథన్ దర్శకుడిగా రాణిస్తూనే ‘డ్రాగన్’ చేశాడు. ఈ సినిమా కూడా విజయం సాధించడంతో ప్రదీప్ ఫాలోయింగ్ మరింత పెరిగింది. ఇటీవల వచ్చిన ‘డ్యూడ్’ కూడా బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది.

హీరోగా, దర్శకుడిగా వరుస విజయాలు సాధిస్తున్న ప్రదీప్ రంగనాథన్, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (Love Insurance Company)చేస్తున్నారు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. షూట్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా పలు వాయిదాలు పడుతూ వస్తుంది. ఈక్రమంలోనే ప్రదీప్ రంగనాథ్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం.. ప్రదీప్ మరోసారి మెగా ఫోన్ పట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన కథానాయకుడిగా.. నటించనున్న చిత్రానికి దర్శకత్వం కూడా వహించనున్నట్లు టాక్. ఈ విషయంపై ప్రముఖ నిర్మాత క్లారిటీ ఇచ్చింది.

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ అధినేత అర్చన కల్పతి మాట్లాడుతూ.. ‘‘ప్రదీప్ రంగనాథన్ ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని ఆయనే స్వయంగా తెరకెక్కిస్తున్నారు. ఇది చాలా ఎక్జైటింగ్ సినిమా. మేము వచ్చే ఏడాదిషూట్ ప్రారంభించడంతో పాటు ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నామని చెప్పింది. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు సక్సెస్ అందుకుంటూ దూసుకుపోతున్న సమయంలో ఇలాంటి రిస్క్ అవసరమా? అని అంటున్నారు.

Next Story