కొంప‌ముంచిన‌ ప్రదీప్ రంగనాథ్.. ప్రభాస్ కొత్త సినిమా లీక్ ?

by velandi.Saikiran |   (  Updated:2025-10-14 06:15:23  IST  )

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కృష్ణంరాజు వారసత్వాన్ని అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో

కొంప‌ముంచిన‌ ప్రదీప్ రంగనాథ్.. ప్రభాస్ కొత్త సినిమా లీక్ ?
X

దిశ‌, వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కృష్ణంరాజు వారసత్వాన్ని అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రభాస్, అంచెలంచెలుగా ఎదిగారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ ప్రపంచ స్థాయికి వెళ్ళింది. ప్రభాస్ ఏ సినిమా తీసినా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కావాల్సిందే. అయితే అలాంటి ప్రభాస్, హనుమ రాఘవపూడి దర్శకత్వంలో ఓ పిరియాడికల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తున్న సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్ గా చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ మూవీకి ఫౌజీ అనే టైటిల్ పెట్టారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు. ఇలాంటి నేపథ్యంలో తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమా గురించి లీకులు ఇచ్చాడు. డ్యూడ్ సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో పాల్గొన్న ప్రదీప్... ఫౌజీ సినిమా గురించి కీలక విషయాలు బయట పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మా నిర్మాతలు నాకు ప్రభాస్ మూవీ ఫౌజీ క్లిప్పింగ్స్ చూపించారని తెలిపాడు. అవి చాలా అద్భుతంగా ఉన్నాయని ఈ సందర్భంగా వెల్లడించారు. దీంతో ప్రభాస్ సినిమాకు ఫౌజీ టైటిల్ ఫిక్స్ అయిందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

READ MORE ......

బాల‌య్య కొత్త మూవీ స్టోరీ లీక్‌...మాఫియా లీడర్‌గా ఎంట్రీ !

Next Story