లవ్ స్టోరీపై ప్రభాస్ షాకింగ్ పోస్ట్.. ఇలా చేస్తావనుకోలేదంటూ నెటిజన్ల కామెంట్స్

by Mallepaka Hamsa |

యంగ్ హీరో సంతోష్ శోభన్(Santosh Shobhan) ‘కపుల్ ఫ్రెండ్లీ’ అంటూ ఓ రిఫ్రెషింగ్ లవ్ స్టోరీతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు.

లవ్ స్టోరీపై ప్రభాస్ షాకింగ్ పోస్ట్.. ఇలా చేస్తావనుకోలేదంటూ నెటిజన్ల కామెంట్స్
X

దిశ, సినిమా: యంగ్ హీరో సంతోష్ శోభన్(Santosh Shobhan) ‘కపుల్ ఫ్రెండ్లీ’ అంటూ ఓ రిఫ్రెషింగ్ లవ్ స్టోరీతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు. మానస వారణాసి హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల కాబోతుంది. ఈక్రమంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. చెన్నై నేపథ్యంలో సాగే ఈ కథలో బైక్ పూలింగ్ చేసే యువకుడిగా సంతోష్, తన వ్యక్తిగత సమస్యల వల్ల ఇల్లు వదిలి వచ్చిన అమ్మాయిగా మానస వారణాసి కనిపిస్తున్నారు. వీరిద్దరి మధ్య కుదిరిన లివింగ్ రిలేషన్ షిప్ ఆ ప్రయాణంలో ఎదురయ్యే సరదా, భావోద్వేగపూరితమైన సన్నివేశాలు ట్రైలర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

ఇద్దరూ కలిసి ఒకే రూమ్ షేర్ చేసుకోవడం నుంచి కథ మొదలవుతుంది. మొదట ఫ్రెండ్స్‌గా మారిన వీరు, ఆ తర్వాత ప్రేమలో పడటం, రిలేషన్‌షిప్‌ను మెయింటెయిన్ చేయడం వంటి అంశాలను సరదాగా, సహజంగా చూపించారు. కామెడీ టైమింగ్, యూత్‌కు కనెక్ట్ అయ్యే డైలాగ్స్‌తో ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై అజయ్ కుమార్ రాజు నిర్మించారు. ఇ్దులో యోగిబాబు, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ మూవీ ట్రైలర్‌పై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశంగా మారింది. ‘‘కపుల్ ఫ్రెండ్లీ ట్రైలర్ మనసులో నుంచి నేరుగా వచ్చిన ప్రేమ కథలా కనిపిస్తోంది’’ అని రాసుకొచ్చాడు. అంతేకాకుండా సంతోష్ శోభన్‌తో పాటు కపుల్ ఫ్రెండ్లీ టీమ్ అందరికీ శుభాకాంక్షలు చెప్పాడు.

ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు కొందరు షాక్ అవుతుండగా.. మరికొందరు మాత్రం మన సినిమాల కంటే పక్కన వాళ్ల చిత్రాలకే ప్రమోషన్స్ ఎక్కువ చేస్తున్నావు సూపర్ అన్నా అని ఓ నెటిజన్ రాయగా.. వేరే మూవీస్‌కి స్టోరీలు పెట్టినవ్ అంటే విచిత్రంగా ఉంది ఇలా చేస్తావనుకోలేదు. ఏం చేస్తం నీ గుణం అలాంటిది అని మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు. మొత్తానికి సంతోష్ శోభన్’కు సపోర్ట్‌గా నిలిచిన ప్రభాస్ పోస్ట్ నెట్టింట చర్చకు దారితీస్తోంది. కాగా.. ప్రభాస్ సినిమాల విషయానికొస్తే.. కల్కి-2, సలార్-2, ఫౌజీ, స్పిరిట్ వంటి చిత్రాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. అయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. పలు పోస్టులు పెడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

Next Story