స్పిరిట్ స్టోరీ లీక్‌..యానిమ‌ల్ లాగే సీక్వెల్ కూడా..సందీప్ ప్లాన్ అదుర్స్ ?

by velandi.Saikiran |   (  Updated:2025-10-22 08:15:17  IST  )

స్పిరిట్ స్టోరీ లీక్‌ క్లైమాక్స్ లో సస్పెన్స్ ఉండేలా ముగించి, సీక్వెల్ కు బాట వేయాలన్నది దర్శకుడి ప్లాన్

స్పిరిట్ స్టోరీ లీక్‌..యానిమ‌ల్ లాగే సీక్వెల్ కూడా..సందీప్ ప్లాన్ అదుర్స్ ?
X

దిశ‌, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వరుసగా పాన్ ఇండియా సినిమాలు తీసుకుంటూ ఇండస్ట్రీని షేక్ చేసేస్తున్నాడు. బాహుబలి తర్వాత, ప్రభాస్ బ్రాండ్ అమాంతం పెరిగిపోయింది. అలాంటి ప్రభాస్ ఇప్పుడు మోస్ట్ సక్సెస్ ఫుల్‌ దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ఇలాంటి నేపథ్యంలో అదిరిపోయే అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభాస్ హీరోగా వస్తున్న స్పిరిట్ సినిమాతో భారీ కాప్ యూనివర్సిటీ రూపొందించేందుకు సందీప్ రెడ్డి వంగ భారీ స్కెచ్ వేశాడట.

దీంతో షూటింగ్ ప్రారంభం కాకముందే ఈ సినిమాపై హైప్‌ పెరిగిపోయింది. ఈ సినిమాలో పవర్ ఫుల్‌ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రభాస్ అందరినీ అలరించబోతున్నారని టాక్. క్లైమాక్స్ లో సస్పెన్స్ ఉండేలా ముగించి, సీక్వెల్ కు బాట వేయాలన్నది దర్శకుడి ప్లాన్ అన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. యానిమల్ మాదిరిగానే స్పిరిట్ కూడా ఫ్రాంచైజీగా తీర్చిదిద్దబోతున్నాడట. ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. ఇందులో తృప్తి డిమ్రి హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. మొదటి షెడ్యూల్ ముంబైలో చేయనున్నారట. ఆ తర్వాత మెక్సికో, ఇండోనేషియా, థాయిలాండ్ లాంటి దేశాల్లో షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ముంబైలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందని టాక్.

READ MORE .....

Prabhas-Hanu:ప్రభాస్ ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్‌.. టైటిల్ పోస్టర్ వ‌చ్చేస్తోంది

Next Story