Unstoppable With NBK Prabhas :భారీ నష్టం.. పైరసీ వెబ్‌సైట్స్‌లో ఎపిసోడ్ లీక్

by Disha Web Desk 2 |
Unstoppable With NBK Prabhas :భారీ నష్టం.. పైరసీ వెబ్‌సైట్స్‌లో ఎపిసోడ్ లీక్
X

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ఆహా వేదికగా 'అన్ స్టాపబుల్' షో ఎంతటి ప్రజాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే రీసెంట్ ఎపిసోడ్‌కి ఇప్పుడు ప్రభాస్ రావడంతో ఎక్కువ స్థాయిలో సబ్ స్క్రైబర్స్ నుంచి ఆదాయం వచ్చింది. ఈ తరుణంలో ఊహించిన విధంగా ఒక దెబ్బ పడింది. వివరాల్లోకి వెళితే.. ప్రభాస్ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ అయితే ఏ స్థాయిలో ఎదురు చూశారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఎపిసోడ్ ముందుగానే స్ట్రీమింగ్ అయ్యేలా చూడాలి అని ఫ్యాన్స్ నుంచి డిమాండ్ రావడంతో. 31వ తేదీన స్ట్రీమింగ్ కావాల్సిన ఎపిసోడ్ ఒకరోజు ముందు స్ట్రీమింగ్ అయింది. అయితే గత రాత్రి ప్రభాస్ ఎపిసోడ్ ప్రీమియర్స్ వీక్షించేందుకు జనాలు అందరూ ఒకేసారి ఆహా యాప్‌ను ఓపెన్ చేయడంతో సర్వర్స్ ఒక్కసారిగా డౌన్ అయిపోయాయి.

ఆహా కొన్ని గంటల వరకు పని చేయకుండా క్రాష్ అయిపోయింది. 9 గంటలకు స్ట్రీమింగ్ కావాల్సిన ఎపిసోడ్‌ను కొంతమంది అయితే 12 గంటల తర్వాత కూడా చూడని పరిస్థితి ఏర్పడింది. అయితే అసలు నష్టం ఏంటి అంటే.. ఆహా సబ్ స్క్రిప్షన్ తీసుకున్న వారి కంటే, తీసుకోని వారు ముందుగా ఈ ఎపిసోడ్‌ను ఎక్కువ స్థాయిలో వీక్షించి నట్లు తెలుస్తోంది. ఎందుకంటే సోషల్ మీడియాలో అప్పటికే విషయం మొత్తం లీక్ కావడంతో, జనాలు పైరసీ వెబ్ సైట్స్ నుంచి ఆహా ఎపిసోడ్ ను ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఇక సోషల్ మీడియాలో పైరసీ న్యూస్ వైరల్ కావడంతో మళ్లీ ఆహా వైపే ఎవరు కూడా తిరిగి చూడలేదు. దీంతో ఆహా ఫ్లాట్ ఫామ్ తీవ్రంగా నష్టపోయింది.

Read more:

Unstoppable Season 2: ప్రభాస్ ఎపిసోడ్ పార్ట్‌వన్ టెలికాస్ట్‌‌కు టైం ఫిక్స్.

Prabhas ఫ్యాన్స్ దెబ్బకు ఆహా సైట్ క్రాష్..!

అన్ స్టాపబుల్ షో అనధికారిక ప్రసారాలు ఆపివేయండి.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed