వివాదంలో ప్రభాస్ ‘ది రాజాసాబ్’.. వారిని బతిమాలుతున్న మూవీ టీమ్.. మరోసారి రిలీజ్ వాయిదా పడనుందా?

by Mallepaka Hamsa |   (  Updated:2025-08-24 06:41:50  IST  )

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న సినిమాల్లో ‘ది రాజాసాబ్’ (The Rajasaab)ఒకటి.

వివాదంలో ప్రభాస్ ‘ది రాజాసాబ్’.. వారిని బతిమాలుతున్న మూవీ టీమ్.. మరోసారి రిలీజ్ వాయిదా పడనుందా?
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న సినిమాల్లో ‘ది రాజాసాబ్’ (The Rajasaab)ఒకటి. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్(Malavika Mohanan), రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. యోగిబాబు, సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. రొమాంటిక్ హారర్ మూవీగా రాబోతుండగా.. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది.

డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఇటీవల సినీ కార్మికుల వేతనాల పెంపుకు నిర్మాతలు ఒప్పుకోకపోవడంతో.. షూటింగులు బంద్ పెట్టిన విషయం తెలిసిందే. అనేక చర్చల తర్వాత 22 నుంచి మళ్లీ షూటింగ్స్ ప్రారంభమయ్యాయి. కానీ ‘ది రాజాసాబ్’ షూట్‌కు వెళ్లమని వర్కర్స్ ఫెడరేషన్‌ను బెదిరిస్తున్నట్లు టాక్. ఎందుకంటే సమ్మె సమయంలో టీజీ విశ్వప్రసాద్ నోటీసులు పంపారని.. తాము షూటింగ్ కు వెళ్ళమని చెప్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయం తెలుసుకున్న మూవీ టీమ్ నోటిస్ వెనక్కి తీసుకుంటామన్నా సరే సినీ కార్కికుల యూనియన్ నాయకులు ఒప్పుకోవర్లేరని సమాచారం. దీంతో వారిని ‘ది రాజాసాబ్’ టీమ్ బతిమాలుతున్నారట.

ఎంతకీ లాభం లేకపోవడంతో ఈరోజు సాయంత్రం జరగబోతున్న మీటింగ్‌లో ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించబోతున్నట్లు పలు పోస్టులు చర్చనీయాంశంగా మారాయి. ‘ది రాజాసాబ్’ వివాదంలో చిక్కుకోవడంతో పాటు షూటింగ్ కూడా ఆగిపోవడంతో ఈ విషయం తెలుసుకున్న అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే సమ్మె ఎఫెక్ట్ భారీ చిత్రాలపై పడగా.. కొన్ని రిలీజ్ వాయిదా పడే అవకాశం కూడా ఉంది. ఇక ‘ది రాజాసాబ్’ కూడా వివాదం తొందరగా సర్దుమనగకపోతే.. మరోసారి వాయిదా పడుతుందేమోనని అంతా అయోమయంలో పడిపోయారు.

link

Next Story