- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Prabhas: ‘ఫౌజీ’ షూటింగ్‌లో ప్రభాస్‌కు తీవ్ర గాయం.. ఆందోళన చెందుతున్న అభిమానులు!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) చేతిలో భారీ బడ్జెట్ చిత్రాలున్నాయి. బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్‌లో పాల్గొంటూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) చేతిలో భారీ బడ్జెట్ చిత్రాలున్నాయి. బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్‌లో పాల్గొంటూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే డార్లింగ్ నటిస్తున్న సినిమాలో ‘ఫౌజీ’ కూడా ఒకటి. హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి టైటిల్ ఫిక్స్ చేయనప్పటికీ ‘ఫౌజీ’ (Fauji) పేరుతో రాబోతున్నట్లు అంతా ఫిక్స్ అయిపోయారు. అయితే ఇందులో కొత్త బ్యూటీ ఇమాన్వి(Imanvi) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ప్రభాస్ మాత్రం ఒక మిలటరీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు టాక్.
దీనిని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేనీ, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోగా.. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కానీ మూవీ మేకర్స్ మాత్రం అప్డేట్స్ విడుదల చేయలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా, ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌లో పలు సీన్స్ చేస్తుండగా.. తీవ్ర గాయం అయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. కాలికి ఫ్రాక్చర్ జరిగిందని పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే ఇంతకు ముందే ఆయన కాలికి గాయం అవడంతో సర్జరీ కూడా చేయించుకున్నారు.
ఇటీవల మళ్లీ ఒకసారి టెస్టులు చేయించుకోవడానికి ఇటలీకి వెళ్లి వచ్చారు. ఇక ఇప్పుడు మరో కాలికి గాయం కావడంతో అయినప్పటికీ విశ్రాంతి తీసుకోకుండా షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు టాక్. అయితే గాయం ఉన్న కాలికి జరిగిందా లేక మరో కాలికి ఫ్రాక్చర్ అయిందా అనేది తెలియాల్సి ఉంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ.. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అంతా కంగారు పడిపోతున్నారు.






