తనకు ఇష్టమైన స్నాక్స్ ఏంటో రివీల్ చేసిన ప్రభాస్.. షాకింగ్ కామెంట్స్ వైరల్

by Mallepaka Hamsa |

అలాంటివి మళ్లీ ఎక్కడా తినలేదని.. చెప్తుంటేనే ఇప్పుడూ నోరూరుతుందని చెప్పారు.

తనకు ఇష్టమైన స్నాక్స్ ఏంటో రివీల్ చేసిన ప్రభాస్.. షాకింగ్ కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఆయన బిజీగా ఉన్నప్పటికీ మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విడుదలైన ‘కపుల్ ఫ్రెండ్లీ’టీమ్‌కు సపోర్ట్‌గా నిలిచి ప్రశంసలు పొందుతున్నారు. మానస వారణాసి, సంతోష్ శోభన్ జంటగా నటించిన ఈ సినిమా థియేటర్స్‌లో మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంటోంది. ఈక్రమంలో.. తాజాగా, ‘కపుల్ ఫ్రెండ్లీ’ (Couple friendly)టీమ్‌తో ప్రభాస్ చిట్ చాట్ నిర్వహించడంతో ఇదులో డార్లింగ్ ఆసక్తికర విషయాలు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నటుడు సంతోష్ శోభన్ ప్రభాస్‌కు ఇష్టమైన స్నాక్స్ ఏంటని ప్రశ్నించగా.. దీనికి ప్రభాస్ స్పందిస్తూ చేసిన కామెంట్స్ అందరినీ షాక్‌కు గురి చేస్తున్నాయి.

విజయవాడలో దొరికే పునుగులు తన ఆల్‌టైమ్ ఫెవరెట్ అని చిన్నప్పుడు సమ్మర్ హాలీడేస్‌తో తన ఫ్రెండ్‌తో కలిసి పునుగులు తినేవాడిని అని అన్నారు. అలాంటివి మళ్లీ ఎక్కడా తినలేదని.. చెప్తుంటేనే ఇప్పుడూ నోరూరుతుందని చెప్పారు. అక్కడికి వెళ్లినప్పుడల్లా తినాలనుకుంటా అని కానీ ఇప్పుడు కుదరడం లేదని కాస్త నిరాశను వ్యక్తం చేశారు. అయితే ఫుడ్ అంటే ఇష్టమున్న ప్రభాస్ ఏదైనా విదేషి ఐటమ్ అంటే ఇష్టం అంటారనుకున్నామని? కానీ పునుగులంటే అంత ఇష్టమా? అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ప్రభాస్ ఫుడ్‌ని ఎంత ఇష్టపడతారో ఈ కామెంట్స్ చూస్తే అర్థమవుతోంది. అలాగే ఎంతోమంది సినీ సెలబ్రిటీలకు ఆయన తిండి పెట్టి ఫిదా చేస్తుంటారు. ప్రతి సినిమా షూట్‌తో తన ఇంటి నుంచి భోజనం తెచ్చి హీరోయిన్లతో పాటు పలువురికి పెడుతుంటారు. ఈ విషయాన్ని ఎంతోమంది హీరోయిన్లు చెప్పిన విషయం తెలిసిందే.

Next Story