ప్రభాస్ ‘రాజాసాబ్’ మూవీ రిలీజ్‍ ఆ పండుగకే .. హింట్ ఇచ్చిన నిర్మాత

by Dishafeatures1 |
ప్రభాస్ ‘రాజాసాబ్’ మూవీ రిలీజ్‍ ఆ పండుగకే .. హింట్ ఇచ్చిన నిర్మాత
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్.. తాను నటిస్తున్న వరుస చిత్రాల్లో ఒక్కోక్కటిగా కంప్లీట్ చేస్తు వస్తున్నాడు. ఇందులో గ్లోబల్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం ఈ ఏడాది మే 9న రిలీజ్ కానుంది. ఇక దీంతో పాటుగా ప్రభాస్ మారుతీ డైరెక్షన్‍లో ‘ రాజాసాబ్’ మూవీ కూడా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనింగ్ క్యారెక్టర్ లో ప్రభాస్‍ను చూస్తారంటూ మేకర్స్ తెలిపారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో నటించే ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉన్నాయి.ఇక ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా ఫస్ట్ లుక్ రివీల్ కాగా పంచెకట్టులో ప్రభాస్ లుక్ అదిరిపోయింది. దీంతో ఫ్యాన్స్ లో ‘రాజాసాబ్ ’ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే ఆసక్తి మొదలైంది.

అయితే తాజాగా ఈ మూవీ రిలీజ్ గురించి హింట్ ఇచ్చారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్.. ‘ ‘రాజాసాబ్’ చిత్రం వచ్చే ఏడాది (2025) సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. డేట్‍ కన్ఫామ్ చేసేకున్నాక ప్రకటిస్తాం’ అని విశ్వప్రసాద్ అన్నారు. అలా 2025 సంక్రాంతి పండుగకు ఈ మూవీ వస్తుందని దాదాపు ఖాయం చేశారు. అయితే వచ్చే ఏడాది 2025 సంక్రాంతి కి కూడా హోరాహోరీ తప్పేలా లేదు. ఎందుకంటే అల్ రెడి చిరంజీవి, అలాగే నాగార్జున కి సంబంధించిన పలు చిత్రాలు వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేస్తామని ప్రకటించారు. దీంతో పాటుగా మరిని స్టార్ హీరోల మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

Read More..

‘పుష్ప 2’ మూవీ లో అల్లు అర్జున్ చనిపోతాడా..? ఇదెక్కడి ట్వీస్ట్ రా సామి



Next Story

Most Viewed