ప్రభాస్ ‘ప్రాజెక్ట్ K’ 2013లో వచ్చిన ఆ సినిమాకు రీమేకా..?

by Disha Web Desk 7 |
ప్రభాస్ ‘ప్రాజెక్ట్ K’ 2013లో వచ్చిన ఆ సినిమాకు రీమేకా..?
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ‘పాజెక్ట్ K’ ఒకటి. గత రెండు, మూడేళ్ల నుంచి సెట్స్‌పై ఉన్న ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే.. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ మూవీపై సోషల్ మీడియాలో అనేక వాదనలు వినిపిస్తున్నాయి.

‘పాజెక్ట్ K’ సినిమా 2013 లో వచ్చిన ‘ఎలిసియం’ అనే సినిమాకు రీమేక్ అని టాక్. ఈ సినిమాలో భూమి ఓ వైపు రోగాలు, మరో వైపు కాలుష్యంతో పాడైపోతుంది. దీంతో డబ్బు ఉన్న వ్యక్తులు ‘ఎలిసియం’ అనే ప్లానెట్ పైకి వెళ్లిపోతారు. కానీ, కింద ఉన్న హీరో అక్కడ ప్రజలను ఎలా కాపాడాడు అనేది ఈ మూవీ స్టోరీ. అయితే ‘పాజెక్ట్ K’ లో కూడా ప్రభాస్ భూమిపై ఉన్న మనుషుల్నీ కాపాడే మిషన్‌లో భాగమవుతాడని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ‘పాజెక్ట్ K’ సినిమా ‘ఎలిసియం’ అనే మూవీకి రీమేక్ అంటూ ఫిల్మ్ నగర్‌లో టాక్ వినిపిస్తోంది. మరి వీటిలో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.




Next Story

Most Viewed