ప్రభాస్-ప్రశాంత్‌ల ‘సలార్’ మూవీ రీమేకా!?

by Disha Web Desk 10 |
ప్రభాస్-ప్రశాంత్‌ల ‘సలార్’ మూవీ రీమేకా!?
X

దిశ, సినిమా: ‘కేజీఎఫ్’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కోలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్‌తో ‘సలార్’ మూవీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. ఇందులో మొదటి భాగం డిసెంబర్ 22న క్రిస్మస్ కానుకగా విడుదలకానుంది. ఇదిలావుంటే.. కన్నడ సూపర్ హిట్ చిత్రం ‘ఉగ్రమ్’కు ‘సలార్’ రీమేక్ అని ఒక టాక్ నడుస్తోంది. 2014లో ‘ఉగ్రమ్’ సినిమాతోనే ప్రశాంత్ నీల్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. కానీ ఈ మూవీ కన్నడలో మాత్రమే రిలీజ్ అయింది. అయితే ఇప్పుడు ఇదే కథలో కొన్ని చేంజెస్ చేసి ప్రభాస్‌తో పాన్ ఇండియా లెవెల్‌లో ఈ మూవీ తెరకెక్కిస్తున్నాడని సమాచారం. దీనిపై మూవీ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Next Story

Most Viewed