‘కృష్ణంరాజు కాలు సర్జరీ కోసం అపోలో ఆసుపత్రికెళ్లాం’ ఉపాసన బిహేవియర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి

by Anjali |
‘కృష్ణంరాజు కాలు సర్జరీ కోసం అపోలో ఆసుపత్రికెళ్లాం’ ఉపాసన  బిహేవియర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి
X

దిశ, సినిమా: టాలీవుడ్ అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి కోడలు.. రామ్ చరణ్ సతీమణి, అపోలో ఫౌండేషన్ వైస్ ఛైర్మన్ ఉపాసన గొప్పతనం గురించి స్పెషల్‌గా చెప్పనవసరం లేదు. ఎన్నో సేవాకార్యక్రమాల్లో పాల్గొని అందరి ప్రశంసలు అందుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా కరోనా టైంలో అనేక మందికి హెల్ప్ చేసి.. గొప్ప మనసు చాటుకుంది. మారుమూల గ్రామాలకు సైతం వైద్య సేవలు అందించింది.

దేశవ్యాప్తంగానున్న పలు రాష్ట్రాల్లోని వృద్ధాశ్రమాలకు కూడా అండగా నిలిచింది. వారికి టాబ్లెట్స్, ఫుడ్, ఇతర సౌకర్యాలు కల్పించింది. ఇలా ఇప్పటికి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ వంటి 150 రాష్ట్రాల్లోని వృద్ధాశ్రమాలకు సహాయం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూకు హాజరై ఉపాసనపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

కృష్ణం రాజు 2 సంవత్సరాల క్రితం మరణించిన విషయం తెలిసిందే. దీంతో టాలీవుడ్ పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇకపోతే శ్యామలా దేవి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘నాకు నా భర్తకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అండ్ ఉపాసన అంటే చాలా ఇష్టం. ఒకసారి మా ఆయన కాలు సర్జరీ కోసం అపోలో హాస్పిటల్ కు వెళ్లాం వెంటనే ఉపాసన హాస్పిటల్‌కొచ్చి, మమ్మల్ని పరామర్శించింది. అలాగే కృష్ణం రాజుకు మంచి ట్రీట్మెంట్ అందించాలని అక్కడున్న వైద్యులకు ఆర్డర్ వేసింది.

తన ప్రవర్తన, మాకిచ్చిన మర్యాదకు నాకు చాలా బాగా అనిపించింది. దీంతో మా ఆయన ఉపాసన నాకు కుమార్తె లాంటిది అని అన్నారు. ఒకసారి మెగాస్టార్ చిరంజీవికి కాల్ చేసినప్పుడు నేను.. ఉపాసన మీ కోడలు కావడం మీ అదృష్టం అని చెప్పాను. దీంతో ఆయన చాలా సంతోషపడ్డారు. ఇక రామ్ చరణ్ మనసు అయితే ఎంత గొప్పదో. నేను ఎక్కడ కనిపించినా ఆంటీ అంటూ దగ్గరికొచ్చి పలకరిస్తాడు’’. అంటూ శ్యామలా దేవి ఇంటర్వ్యలో మెగా కోడలు ఉపాసన అండ్ రామ్ చరణ్ పై పొగడ్తల వర్షం కురిపించింది.

Read More..

Hero Venkatesh : లుంగీ లుక్ లో వెంకటేష్.. ఫొటో అదిరిందిగా

Next Story