అదిరిపోయే న్యూస్.. ఎప్రిల్21న ప్రభాస్ పెళ్లి, వధువు ఆమెనా?

by Disha Web Desk 8 |
అదిరిపోయే న్యూస్.. ఎప్రిల్21న ప్రభాస్ పెళ్లి, వధువు ఆమెనా?
X

దిశ, సినిమా : టాలీవుడ్‌లో ఎప్పుడూ వినిపించే గాసిప్‌లో ముందుడేది ప్రభాస్ పెళ్లికి సంబంధించినదే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అతని ఫ్యాన్సే కాదు, సినీ నటులు కూడా ఎదురు చూస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈయన పెళ్లికి సంబంధించిన ఎన్నో వార్తలు నెట్టింట తెగ వైరల్ అవుతూ ఉన్నాయి. తాజాగా ప్రభాస్ మ్యారేజ్‌కు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తోంది.

అది ఏమిటంటే? గత ఏడాది కృష్ణం రాజు భార్య, ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి ప్రభాస్ పెళ్లిపై కీలక వ్యాఖ్యలు చేసింది. వచ్చే ఏడాది ప్రభాస్ పెళ్లి చేస్తామని క్లారిటీ ఇచ్చింది.దీంతో నెటిజన్స్ మరోసారి డార్లింగ్ ఈ 2024లో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఓ వార్తను తెగ వైరల్ చేస్తున్నారు.

ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఈ ఇయర్‌లో తమకు ఇష్టమైన హీరో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. ప్రభాస్ పెద్దమ్మ , తమ ఫ్యామిలీలోనే ఓ అమ్మాయిని ప్రభాస్‌కు ఇచ్చి పెళ్లి చేయడానికి డేట్స్ కూడా ఫిక్స్ చేసింది.మార్చిలో 17వ తేదీన ప్రభాస్ నిశ్చితార్ధం చేసుకుంటారని.. ఏప్రిల్ 21వ తేదీ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ఓ వార్త నెట్టింట తెగ హల్ చేస్తోంది. ఇక ప్రభాస్ పెళ్లి గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే.



Next Story

Most Viewed