- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రభాస్ లేటెస్ట్ లుక్.. అస్సలు ఊహించలేదుగా అంటున్న నెటిజన్లు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్నారు.

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్నారు. ప్రస్తుతం డార్లింగ్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ‘స్పిరిట్’ మూవీ చేస్తున్నారు. అయితే ఇందులో ప్రభాస్ సరసన త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమాతో పాటు సలార్-2, కల్కి-2 వంటి భారీ ప్రాజెక్ట్స్‌తో పాటు హను రాఘవపూడి డైరెక్షన్‌లో ‘ఫౌజీ’ చిత్రం చేస్తున్నాడు. డార్లింగ్ త్వరలోనే ‘ది రాజాసాబ్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. హారర్, కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రాన్ని మారుతి తెరకెక్కిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్(Nidhi Agarwal), రిద్ధి కుమార్, మాళవిక మోహనన్(Malavika Mohanan) హీరోయిన్లుగా నటిస్తున్నారు.
డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో.. తాజాగా, ప్రభాస్ ఫొటో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక అది చూసిన వారంతా షాక్‌కు గురవుతున్నారు. ఎప్పుడూ బయటకు రాని ప్రభాస్ హైదరాబాద్ థియేటర్‌లో ఓ సినిమా చూడటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో కలిసి డార్లింగ్ ‘ఎఫ్-1’ హాలీవుడ్ మూవీని చూశారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమాక్స్ థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేశారు. అలాగే తన అభిమానులకు సెల్ఫీలు కూడా ఇచ్చారు. ఇంట్రవర్స్ అయిన ఆయన సినిమా చూసేందుకు థియేటర్‌కు వచ్చాడని తెలిసిన నెటిజన్లు వామ్మో ఇంతలా మారిపోయాడేంటి.. అస్సలు ఊహించలేదని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. కాగా, త్వరలోనే ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో ‘సలార్-2 రాబోతున్న విషయం తెలిసిందే.






