ప్రభాస్ ‘kalki2898AD’లో టాలీవుడ్ స్టార్ హీరో.. సీక్రెట్ రివీల్

by Disha Web Desk 6 |
ప్రభాస్ ‘kalki2898AD’లో టాలీవుడ్ స్టార్ హీరో.. సీక్రెట్ రివీల్
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల ‘సలార్’ మూవీతో భారీ విజయం సాధించాడు. ప్రస్తుతం సక్సెస్ ఎంజాయ్ చేస్తూనే వరుస చిత్రాల్లో నటిస్తూ దూసుకెళ్తున్నాడు. అయితే ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో ప్రాజెక్ట్-K (కల్కి 2898AD) రాబోతున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన విడుదలైన విషయం తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. ఇందులో దీపికా పదుకొణె, దిశా పటానీ, కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను వైజయంతీ మూవీ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మిస్తున్నాడు. ఇప్పటి వరకు కల్కి నుంచి పోస్టర్స్, గ్లింప్స్ తప్ప ఎలాంటి అప్డేట్స్ రాలేదు.

కానీ ఈ మూవీకి సంబంధించిన ఏదో ఒక వార్త మాత్రం నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా, కల్కి2898లో టాలీవుడ్ స్టార్ హీరో రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని తెలపడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఆయన మాట్లాడుతూ.. వందల కోట్లతో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. నేను (ప్రాజెక్ట్-కె) కల్కి 2898ADలో నటిస్తున్నాను. అంతేకాకుండా మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్నాను’’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.



Next Story

Most Viewed