- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభాస్ అలాంటోడు.. చర్చనీయాంశంగా మారిన స్టార్ హీరోయిన్ కామెంట్స్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ‘ది రాజాసాబ్’(The Raja Saab) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ‘ది రాజాసాబ్’(The Raja Saab) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 9న థియేటర్స్‌లోకి రానుంది. ఈక్రమంలో.. ఓ స్టార్ హీరోయిన్ ప్రభాస్‌పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శ్రద్ధా కపూర్(Shraddha Kapoor), ప్రభాస్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘‘సామో సినిమాలో ప్రభాస్‌తో కలిసి పని చేయడానికి ముందు నేను చాలా నర్వస్‌గా ఉన్నాను. బాహుబలి తర్వాత ఆయన చేసిన తొలి సినిమా అది. అంత పెద్ద విజయం తర్వాత ఆయనతో నేను కలిసి నటించడం పెద్ద బాధ్యతగా అనిపించింది. కానీ ప్రభాస్ నా ఇబ్బందిని అర్థం చేసుకుని.. నాతో కాసేపు మాట్లాడారు. సెట్‌లో నాకు పూర్తి కంఫర్ట్ ఇచ్చారు’’ అని చెప్పుకొచ్చింది.
అయితే ఈ కామెంట్స్ గతంలో చేసినవి అయినప్పటికీ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు గ్రేట్ అంటూ ప్రశంసలు కురిపిస్తుండగా.. మరికొందరు మాత్రం బిర్యానీలు పెట్టడమే కాదు.. ఇలాంటివి కూడా చేయడం గొప్ప విషయం ఎంతైనా ప్రభాస్ మనసు చాలా మంచిదని అంటున్నారు. మొత్తానికి శ్రద్ధా కపూర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తున్నాయి. కాగా.. ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన ‘సాహో’ సుజీత్ దర్శకత్వంలో వచ్చింది. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో యాక్షన్ సీక్వెన్స్, విజువల్ ఎఫెక్ట్స్‌తో వచ్చినప్పటికీ పెద్దగా హిట్ అందుకోలేకపోయింది. భారీ అంచనాల మధ్య విడుదలై.. మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఈ ప్రభావం.. ఇందులో నటించిన వారందరి కెరీర్‌పై పడింది.






