బాలీవుడ్ స్టార్ హీరోల వెన్నులో.. వణుకు పుట్టిస్తున్న ప్రభాస్

by Dishafeatures1 |
బాలీవుడ్ స్టార్ హీరోల వెన్నులో.. వణుకు పుట్టిస్తున్న ప్రభాస్
X

దిశ, సినిమా: ఒకప్పుడు సౌత్ సినిమాలు అంటే చిన్న చూపు చూసిన బాలీవుడ్ హీరోలు ఇప్పుడు.. ఒకే ఒక సౌత్ హీరో ని చూసి భయపడుతున్నారు. తాజాగా ‘సలార్’ మూవీ తో సూపర్ డూపర్ హిట్ అందుకున్న ప్రభాస్ ప్రస్తుతం బాలీవుడ్ హీరోలు అందరి వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు.

ఇప్పటి వరకు హింది లో ఖాన్ త్రయం వాళ్లే నెంబర్ వన్ హీరోలుగా ఫీల్ అయిపోతూ ఉన్నప్పటికి.. ప్రభాస్ నటించిన ప్రతి ఒక సినిమా సూపర్ డూపర్ సక్సెస్ లు అవుతుండటంతో, ఇప్పుడు టోటల్ పాన్ ఇండియా లోనే నెంబర్ వన్ హీరో గా గుర్తింపు పొందుతున్నాడు మన డార్లింగ్. ఈ విషయం లో ప్రభాస్ ని తప్పకుండా మెచ్చుకోవాల్సిందే. ‘బాహుబలి’ తో తనకంటూ ఒక రేంజ్ ని సంపాదించుకున్ని,ఇప్పుడు ‘సలార్’ తో అంతకుమించి అనేలా సూపర్ డూపర్ సక్సెస్ ని సొంతం చేసుకున్నాడు. ఇక నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో చేయబోయే తన తదుపరి సినిమా ‘కల్కి’ మీద ఎక్కువ ఫోకస్ పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ కూడా సక్సెస్ అయింది అంటే ఇక ప్రభాస్ ని ఎవ్వరు ఆపలేరు


Next Story

Most Viewed