బ్లాక్ బస్టర్ ‘దసరా’ సినిమా డైరెక్టర్‌తో జతకట్టబోతున్న ప్రభాస్!

by Disha Web Desk 9 |
బ్లాక్ బస్టర్ ‘దసరా’ సినిమా డైరెక్టర్‌తో జతకట్టబోతున్న ప్రభాస్!
X

దిశ, వెబ్‌డెస్క్: ‘బహుబలి’ చిత్రంలో ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఈ హీరో ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఇప్పటివరకు ప్రభాస్ నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ సినిమాలనే చెప్పుకోవచ్చు. కానీ ఇటీవల వచ్చిన ‘ఆదిపురుష్’ మాత్రం ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో డైరెక్టర్‌ను ప్రభాస్ అభిమానులు దారుణంగా తిట్టిపోశారు. నాచురల్ స్టార్ నానితో ఫ్యామిలీ సినిమాలు తెరకెక్కించే డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల గత కొద్ది నెలలుగా ప్రభాస్ కోసం రస్టిక్ యాక్షన్ కథ సిద్ధం చేస్తున్నారట.

ఇటీవలే ఈ స్టోరీ ఫినిష్ చేసి ప్రభాస్‌ను సంప్రదించనున్నారని సమాచారం. ఇక ఈ సినిమా కథ ప్రభాస్‌కు నచ్చితే నెక్ట్స్ ఎప్పటినుంచి ప్లాన్ చేసుకోవాలి అనే విషయాలు చర్చించుకుంటారట. అయితే చిత్ర బృందం కచ్చితంగా ఈ కథ రెబల్ స్టార్‌కు నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నారట. ఇక ఫ్యాన్స్.. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సినిమా అంటే తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందనే నమ్మకంతో ఉన్నారు. నాని హీరోగా వచ్చిన ‘దసరా’ చిత్రం ఏ రేంజ్‌లో హిట్ అయ్యిందో తెలిసిందే.

Next Story

Most Viewed