ఫైనల్లీ పెళ్లి చేసుకోబోతున్న ప్రభాస్.. ఆలయంలో హీరో పెద్దమ్మ ప్రత్యేక పూజలు.. ఖుషీలో ఫ్యాన్స్

by I. Sairam |   (  Updated:2025-07-09 13:27:33  IST  )

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

ఫైనల్లీ పెళ్లి చేసుకోబోతున్న ప్రభాస్.. ఆలయంలో హీరో పెద్దమ్మ ప్రత్యేక పూజలు.. ఖుషీలో ఫ్యాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీబిజీగా ఉన్నాడు. ఇక అతని పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే నాలుగు పదుల వయసు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు మ్యారేజ్ చేసుకోకుండా స్టిల్ సింగిల్‌గా ఉన్నాడు. అయితే చాలా సార్లు అతని పెళ్లి పై చాలా రూమర్స్ వినిపించాయి. ఈ క్రమంలో తాజాగా మరోసారి అతని పెళ్లి వార్తలు జోరందుకున్నాయి. వివరాల్లోకి వెళితే.. 45 ఏళ్ళు వచ్చినా ఇంకా ప్రభాస్ పెళ్లి చేసుకోలేదు. దీంతో గత కొన్నేళ్లుగా డార్లింగ్ వివాహంపై జోరుగా చర్చలు నడుస్తున్నాయి. ఈ పరిస్థితుల నడుమ ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి ఓ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం మరోసారి చర్చనీయాంశం అయింది.

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలో తలుపులమ్మ లోవ ఆలయంలో ఆషాఢ మాసం జాతర జరుగుతుండగా.. అక్కడికి వచ్చిన శ్యామల దేవి(Shyamala Devi) అమ్మవారికి కుంకుమార్చన చేసి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ప్రభాస్‌ పెద్దమ్మ రావడంతో ఆలయ అధికారులు ప్రత్యేకంగా ఆమెకు దర్శనం కల్పించారు. ఆలయ విశిష్టత, అమ్మవారి మహిమ వివరించారు. అయితే శ్యామల ఇంత సడెన్‌గా టెంపుల్ సందర్శించడం వెనుక ఏదో ఉందని, ప్రభాస్‌ పెళ్లి చేసుకోబోతున్నారు కాబట్టే ఆమె ముందస్తుగా పూజలు చేస్తోందని చెప్పుకుంటున్నారు జనం. త్వరలోనే ప్రభాస్ పెళ్లి ఉంటుంది అని ఇప్పటికే చాలా సార్లు చెప్పిన శ్యామలా దేవి.. ఇలా పూజలు చేయడంతో ఆ వార్తలకు మరింత ఆజ్యం పోయినట్టయింది. మరి ఇందులో నిజమెంతో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Next Story