- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ పార్ట్‌పై అలాంటి టాటూ వేయించుకోవడంతో కోరిక తీరిందంటున్న ప్రభాస్ హీరోయిన్.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ (Kriti Sanon)తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించి మెప్పించింది.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ (Kriti Sanon)తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. స్టార్ హీరోలు ప్రభాస్, మహేష్ బాబు, నాగచైతన్య వంటి వారితో నటించి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘కాక్‌టేల్-2’ (Cocktail-2)మూవీలో నటిస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ నిత్యం పలు పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా, కృతి సనన్ ఓ కీలక నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ విషయాన్ని తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది.
కృతి ఓ కొత్త టాటూ తన కాలుపై మొట్టమొదటిసారి వేయించుకున్నట్లు తెలుపుతూ.. ‘‘నేను టాటూ వేయించుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఇప్పుడు తొలిసారి వేసుకున్నాను. దీంతో నా కోరిక నెరవేరింది. ఈ పక్షిలాగా నేను కూడా స్వేచ్ఛగా, ఉదయం సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూ నా జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను. కళ్లలో కలలు ఉన్నవారు.. మీరు భయపడే ఆ ఎత్తును అంగీకరించాలి. అది సులభం కాదు. కానీ మీ మార్గాన్ని మీరు కనుగొంటారు. ఎగరడం నేర్చుకుంటారు. ముందడుగు వేయాలి’’ అని రాసుకొచ్చింది. దీంతో అది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.






