- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ స్పెషల్ డే నాడు ప్రభాస్-హను రాఘవపూడి సినిమా అప్డేట్.. ఫుల్ ఖుషీలో అభిమానులు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) సలార్-2, కల్కి-2, స్పిరిట్ వంటి భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు.

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) సలార్-2, కల్కి-2, స్పిరిట్ వంటి భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. అలాగే డార్లింగ్ హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో కొత్త బ్యూటీ ఇమాన్వి ఇస్మాయిల్(Imanvi Ismail) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, టి సిరీస్ బ్యానర్స్‌పై నవీన్ ఎర్నేని, ఎలమంచిలి రవిశంకర్, గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే 1940 బ్యాక్ డ్రాప్‌లో సినిమా తెరకెక్కబోతుందని సమాచారం. ఈ సినిమాకు చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం కూడా పూర్తవగా.. ఆగస్టు నెలలో షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు టాక్. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా? అని ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ రాబోతున్నట్లు ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ప్రభాస్-హను రాఘవపూడి మూవీ టైటిల్ ఆగస్టు 15న రాబోతున్నట్లు టాక్. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు, ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.






