ఇమాన్వికి బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన ప్రభాస్.. వైరల్‌గా మారిన ఇన్‌స్టా పోస్ట్

by Mallepaka Hamsa |

ఇమాన్వి ఎంతో సంతోషపడిపోతూ, తన ఆనందాన్ని తట్టుకోలేక ప్రభాస్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది.

ఇమాన్వికి బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన ప్రభాస్.. వైరల్‌గా మారిన ఇన్‌స్టా పోస్ట్
X

దిశ, సినిమా: ప్రభాస్(Prabhas) అంటే కేవలం కటౌట్ మాత్రమే కాదు, ఆయనది చాలా పెద్ద మనసు అని ఇండస్ట్రీలో అందరూ చెబుతుంటారు. షూటింగ్ సెట్స్‌లో తోటి నటీనటులకు తన ఇంటి నుంచి రకరకాల వంటకాలు పంపించి విందు ఇవ్వడం ప్రభాస్‌కు అలవాటు. ఇప్పుడు అదే మ్యాజిక్ తన కొత్త సినిమా ‘ఫౌజీ’ (Fauji) హీరోయిన్ ఇమాన్వి (Imanvi)విషయంలోనూ రిపీట్ అయ్యింది. ప్రభాస్ పంపిన ఫుడ్ చూసి ఈ భామ తెగ మురిసిపోతోంది. ప్రభాస్ తన కోసం పంపిన స్పెషల్ ఫుడ్ ఐటమ్స్‌ను ఇమాన్వి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. డార్లింగ్ చూపించిన ఈ ప్రేమకు, పంపిన రుచికరమైన భోజనానికి ఆమె ఎంతో సంతోషపడిపోతూ, తన ఆనందాన్ని తట్టుకోలేక ప్రభాస్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు డార్లింగ్ ఈజ్ బ్యాక్.. ఆతిథ్యంలో ఆయనకు ఎవరూ సాటి రారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. ప్రస్తుతం ప్రభాస్, ఇమాన్వి జంటగా పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఫౌజీ’. టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పూజా కార్యక్రమాల ఫోటోల్లో ఈ జంట చూడముచ్చటగా ఉండటంతో, వీరిద్దరి కెమిస్ట్రీ వెండితెరపై ఎలా ఉండబోతోందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Next Story