అభిమాని చివరి కోరిక తీర్చిన ప్రభాస్.. వీడియో వైరల్

by Disha Web Desk 10 |
అభిమాని చివరి కోరిక తీర్చిన ప్రభాస్.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రభాస్‌ అభిమాని అయిన కేరు కన్నయ్య అలియాస్‌ రంజిత్‌.. ఇటీవల క్యాన్సర్ కారణంగా కన్నుముశాడు. అయితే కన్నయ్యకు ప్రభాస్ అంతే చాలా ఇష్టం. చనిపోకముందే ప్రభాస్‌ను కలవాలని ఉన్నట్లు తల్లి తండ్రులకు చెప్పాడు. దీంతో కుమారుడి చివరి కోరిక తీర్చేందుకు అతని తల్లి దర్శకుడు పూరి జగన్నాథ్ భార్య లావ‌ణ్యకు ఫోన్ చేసి విషయం చెప్పింది. విషయం తెలుసుకున్న ప్రభాస్ వెంటనే వెళ్లి తన అభిమానిని కలిసి, అతనికి ఇష్టమైన ఫుడ్ తెప్పించి తినిపించాడు. అలాగే కన్నయ్య కోరిక మేరకు ‘బాహుబలి’ సినిమాలో వినియోగించిన కత్తిని బహుమతిగా ఇచ్చాడు. కొడుకు ఆనందం చూసి తల్లిదండ్రులు చాలా ఆనందించారు. ఈ వీడియో చూసిన అభిమానులు ‘నువ్వు దేవుడివి స్వామి’ అంటూ హీరోపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read..

యాక్సిడెంట్‌పై స్పందించిన హీరో శర్వానంద్



Next Story

Most Viewed