‘ప్రాజెక్ట్ K’ నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్‌.. సూపర్ హీరో ల్యాండ్ అయిపోయాడు..

by Disha Web Desk 2 |
‘ప్రాజెక్ట్ K’ నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్‌.. సూపర్ హీరో ల్యాండ్ అయిపోయాడు..
X

దిశ, సినిమా: ప్రభాస్ అప్‌కమింగ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌లో ‘ప్రాజెక్ట్ K’ ఒకటి. ఇప్పటికే వరల్డ్ వైడ్ క్రేజ్ సంపాదించిన ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకుడు కాగా.. 80 శాతానికిపైగా షూట్ పూర్తి అయింది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, అగ్ర కథానాయకుడు కమల్ హాసన్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే లాంటి స్టార్స్ నటిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే హీరోయిన్ ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా.. తాజాగా ప్రభాస్ ఫ‌స్ట్‌ లుక్‌‌ విడుదల చేశారు మేకర్స్. ఈ పిక్‌లో ప్రభాస్ లాంగ్ హెయిర్‌తో సూపర్ మ్యాన్‌గా కనిపించాడు. దీంతో పాటు ఈ మూవీ ఫ‌స్ట్ గ్లింప్స్‌ను అమెరికాలోని శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్‌లో గురువారం రిలీజ్ చేయ‌బోతున్నట్లుగా ప్రకటించింది చిత్ర యూనిట్. ఇండియా టైమింగ్ ప్రకారం శుక్రవారం అన్నమాట. ఇక ఈ ఫస్ట్ లుక్‌పై స్పందిస్తున్న ఫ్యాన్స్ ‘మన సూపర్ హీరో ల్యాండ్ అయిపోయాడు’ అంటూ ఖుష్ అవుతున్నారు.

Read More: Project K's first glimpse : ఫాన్స్కు గుడ్ న్యూస్.. ఫస్ట్ గ్లింప్స్‌కు ముహూర్తం ఫిక్స్

Next Story

Most Viewed