’సలార్’ సక్సెస్ తర్వాత ప్రభాస్ మొదటి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ఇదే?

by Disha Web Desk 9 |
’సలార్’ సక్సెస్ తర్వాత ప్రభాస్ మొదటి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ఇదే?
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. KGF ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో క్రిస్మస్ సందర్భంగా విడుదలైన సాలార్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ కుదురుగా ఉంటారా? ‘‘రెబల్ స్టార్ చాలా తక్కువగా మాట్లాడే పర్సన్ కాబట్టే.. సలార్ సినిమా సూపర్ సక్సెస్ అందుకున్న కూడా స్పందించకుండా సైలెంట్‌గా ఉన్నారు. అది కదా మా అన్న గొప్పతనం అంటూ ప్రభాస్‌ను ఆకాశానెత్తుతున్నారు.

అయితే తాజాగా ప్రభాస్ తన అధికారిక హ్యాండిల్‌లో ఇన్‌స్టా స్టోరీని పోస్ట్ చేశాడు. కానీ ఆ స్టోరీ ఈ మూవీకి సంబంధించినది కాదు. మరీ ఎంటని అనుకుంటున్నారా? బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు విషెష్ చెప్పిన స్టోరీ. వైజయంతీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌ కె అకా కల్కి చిత్రంలో ప్రభాస్‌ - దీపికా పదుకొణెతో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా నేడు దీపికా పదుకొణె బర్త్ డే సందర్భంగా.. చాలా రోజుల తర్వాత మన పాన్ ఇండియా స్టార్..‘‘హ్యీపీ బర్త్ డే మోస్ట్ బ్యూటీఫుల్ దీపికా పదుకొణె. ఈ సంవత్సరం నీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను అంటూ దీపికాను స్టన్నింగ్ అని పిలిచాడు. దీంతో సోషల్ మీడియాలోని నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.



Next Story

Most Viewed