తీవ్ర విషాదం.. ‘సలార్’ విడుదల రోజు ప్రభాస్ అభిమాని మృతి

by Disha Web Desk 2 |
తీవ్ర విషాదం.. ‘సలార్’ విడుదల రోజు ప్రభాస్ అభిమాని మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభాస్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సలార్ సినిమా ఎట్టకేలకు విడుదల అయింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉండగా.. సలార్ విడుదల రోజే రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఈ విషాదం చోటు చేసుకుంది. సలార్ సినిమా విడుదల సందర్భంగా కరెంట్ షాక్‏తో ఓ అభిమాని మృతి చెందాడు.

పట్టణంలోని రంగ థియేటర్‏ ఎదుట గురువారం ఒక ఇంటిపై ఫ్లెక్సీ కడుతూ హీరో ప్రభాస్ అభిమాను బాలరాజు (27) విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. తమ అభిమాన హీరో నటించిన సలార్ సినిమా శుక్రవారం విడుదలకానుండడంతో ఫ్యాన్స్ అంతా ఎమోషనల్ అవుతున్నారు. మృతిచెందిన బాలరాజు దుస్తుల వ్యాపారం చేస్తున్నారు. ఆయన ప్రభాస్ వీరాభిమాని. మృతుడికి భార్య శిరీష, ఇద్దరు కుమారులు ఉన్నారు. ధర్మవరం ఒకటో పట్టణ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read..

Prabhas: మరోసారి తప్పిన వేణు స్వామి జోస్యం.. ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ.. వేణు స్వామి జాతకాలు చెప్పడం మానేయా...

Next Story

Most Viewed