- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభాస్ బర్త్ డే ట్రీట్..రాజాసాబ్ నుంచి క్రేజీ అప్డేట్ !
ప్రభాస్ బర్త్ డే ట్రీట్..రాజాసాబ్ నుంచి క్రేజీ అప్డేట్ ! ఈ సినిమా నుంచి అదిరిపోయే సాంగ్ వదిలే అవకాశాపోస్ట్ పెట్టారు.

దిశ, వెబ్ డెస్క్ : రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కృష్ణంరాజు వారసత్వాన్ని అందిపుచ్చుకొని, ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రభాస్ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు. అలాంటి ప్రభాస్ ప్రస్తుతం ది రాజా సాబ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందని చెబుతున్నారు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహించగా, ప్రభాస్ సరసన ముగ్గురు భామలు నటించనున్నారు. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్... ప్రభాస్ సరసన స్టెప్పులు వేయనున్నారు.
కామెడీతో పాటు హారర్ నేపథ్యంలో ఈ సినిమా కథ నడవనున్నట్లు సమాచారం. యోగి బాబు ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు. అయితే ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23వ తేదీ అన్న సంగతి తెలిసిందే. ఆ రోజున ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ రానున్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా హింట్ ఇచ్చాడు. ప్రభాస్ పుట్టిన రోజున ఈ సినిమా నుంచి అదిరిపోయే సాంగ్ వదిలే అవకాశాలు ఉన్నట్లు తమన్ పరోక్షంగా పోస్ట్ పెట్టారు. అక్టోబర్ 23వ తేదీన రెబల్ సాబ్ ఎంట్రీ ఉంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దీంతో ఆ రోజున సాంగ్ లేదా చిన్నపాటి టీజర్ రిలీజ్ చేస్తారని అందరిలోనూ ఉత్కంఠత నెలకొంది.






