Manchu Vishnu సినిమాలో శివునిగా Prabhas..!

by Disha Web Desk 12 |
Manchu Vishnu సినిమాలో శివునిగా Prabhas..!
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పటికే సాలర్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్.. వంటి మూడు భారీ సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా హీరో ప్రభాస్.. విష్ణుతో కలిసి ప్రభాస్ నటించనున్నారనే వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆదిపురుష్ సినిమాలో రాముని పాత్రలో కనిపించిన ఆయన ప్రస్తుతం శివుని రూపంలో కనిపించనున్నాడని వార్త ప్రభాస్ అభిమానులకు ఆకాశానికి ఎత్తేస్తుంది. మంచు విష్ణు హీరోగా, కృతి సనన్ సోదరి నుపూర్ సనన్ హీరోయిన్ గా నటించనున్న 'కన్నప్ప' సినిమా ఇటీవల పూజ కార్యక్రమం కూడా పూర్తి చేసుకుంది.

ముఖేష్ సింగ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ రచనలు అందించారు. అలాగే మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీత దర్శకులు. ఈ సినిమా అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై నిర్మించనున్నారు.. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రంలో కన్నప్ప పాత్రలో మంచు విష్ణు నటించనుండగా గెస్ట్ రోల్ లో శివుడి పాత్రలో ప్రభాస్ నటించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. మరి ఈ వార్తలపై ప్రభాస్, అలాగే కన్నప్ప చిత్ర బృందం స్పందించాల్సిన ఉంది.



Next Story

Most Viewed