ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పనున్న Prabhas-Anushka.. త్వరలోనే ఆ ప్రకటన!

by Anjali |
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పనున్న Prabhas-Anushka.. త్వరలోనే ఆ ప్రకటన!
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- అనుష్క జోడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి కాంబోలో వచ్చిన బిల్లా, మిర్చి, బహుబలి, లాంటి ఎన్నో చిత్రాలు రికార్డులు బద్దలు కొట్టాయి. నిజ జీవితంలో కూడా వీరిద్దరు మంచి ఫ్రెండ్స్. కాగా.. రెబల్ స్టార్, స్వీటి స్ర్కీన్ మీద కనిపిస్తే చాలు ఫ్యాన్స్‌కు పండగే. ఈ ఇద్దరి కెమిస్ట్రీ అంత పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది. గతంలో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి.

కానీ మేమిద్దరం మంచి స్నేహితులమని క్లారిటీ ఇచ్చి.. పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టారు. అయితే మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న చిత్రంలో అనుష్క కూడా యాక్ట్ చేస్తు్న్నట్లు నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీలో అనుష్క ఓ కీలక రోల్‌లో నటించనుందట. కానీ హీరోయిన్‌గా మాత్రం కాదట. అలాగే క్రిష్ దర్వకత్వంలో కూడా వీరిద్దరూ ఓ చిత్రం చేయనున్నారట. ఇప్పటికే బహుబలి ప్రొడ్యూసర్లకు స్టోరీ వివరించగా.. వారు కూడా నిర్మించడానికి ముందుకు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.

Next Story

Most Viewed