ప్రభాస్ ‘ఆదిపురుష్’ మంచి విజయం సాధించాలి.. డిప్యూటీ సీఎం పోస్ట్

by Disha Web Desk 6 |
ప్రభాస్ ‘ఆదిపురుష్’ మంచి విజయం సాధించాలి.. డిప్యూటీ సీఎం పోస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా రామయణం బ్యాక్‌గ్రౌండ్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదిపురుష్’. ప్రభాస్ మొదటిసారి రాఘవపాముడిగా వెండితెరపై వెలుగులు పంచబోతున్నాడు. దీనికి డైరెక్టర్ ఓం రౌత్ రూపొందించాడు. కాగా, ఈ సినిమా జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలుపుతున్నారు. తాజాగా, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఓ పోస్ట్ చేశారు. మర్యాద పురుషోత్తముడు రాముని జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా కోసం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అందరిపై ఆయన దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాను. ‘ఆదిపురుష్‌’ మంచి విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’’. అంటూ దర్శక నిర్మాతలకు ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పారు.

Also Read: KGF-2, పఠాన్ రికార్డులను బ్రేక్ చేసిన ‘ఆదిపురుష్’ అడ్వాన్స్ బుకింగ్స్..! (వీడియో)



Next Story

Most Viewed