‘విశాల్-35’కి పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్.. సమయం ఆసన్నమైందంటూ హైప్ పెంచిన మేకర్స్ పోస్ట్ (వీడియో)

by Mallepaka Hamsa |   (  Updated:2025-08-26 05:20:58  IST  )

కోలీవుడ్ స్టార్ విశాల్ (vishal) ఇటీవల ‘మదగజరాజా’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

‘విశాల్-35’కి పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్.. సమయం ఆసన్నమైందంటూ హైప్ పెంచిన మేకర్స్ పోస్ట్ (వీడియో)
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ విశాల్ (vishal) ఇటీవల ‘మదగజరాజా’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ఓ భారీ ప్రాజెక్ట్‌తో రాబోతున్నట్లు అధికారిక ప్రకటన కూడా విడుదల చేశాడు. ఆయన కెరీర్‌లో 35వ సినిమాగా రాబోతుండగా.. దీనిని రవి అరసు(ravi arasu) తెరకెక్కిస్తున్నారు. ఇందులో దుషారా విజయన్(Dushara Vijayan) హీరోయిన్‌గా నటిస్తుండగా.. అంజలి (anjali) కీలక పాత్రలో కనిపించనుంది. ‘విశాల్-35’ వర్కింగ్ టైటిల్ రూపొందిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి ప్రతిష్టాత్మక బ్యానర్ సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు చెన్నైలో ఘనంగా జరిగాయి. షూటింగ్ కూడా త్వరలో ప్రారంభం కాబోతుండగా.. మూవీ మేకర్స్ ఇందులో నటిస్తున్న నటీనటులకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తున్నారు.

అయితే విశాల్, రవి అరసు కాంబోలో రాబోతున్న మొదటి మూవీ అయినప్పటికీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా, ‘విశాల్-35’ సినిమా నుంచి డబుల్ అప్డేట్స్ వచ్చాయి. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ టీజర్‌ను రిలీజ్ చేసి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ చిత్రానికి ‘మగుడం’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుపుతూ హీరో లుక్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ముందుగా సముద్రంలోని చేపలను చూపించగా.. చివరగా అందులోంచి ఓ పీత బయటకు రాగా.. సముద్రం మధ్యలో విశాల్ వైట్ కలర్ సూట్ బూటు ధరించి పవర్ లుక్‌లో కనిపించాడు. కానీ వెనక్కి తిరిగి ఉండటంతో అది చూసిన నెటిజన్లు నిరాశ చెందుతున్నారు. ఈ మూవీ సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్నట్లు అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ టైటిల్ టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతోంది.

Next Story