- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పృథ్వీరాజ్ సుకుమారన్ కొత్త సినిమా నుంచి పవర్ ఫుల్ గ్లింప్స్ రిలీజ్.. భారీ హైప్ క్రియేట్
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) వరుస సినిమాలు చేస్తూనే ఓ వైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) వరుస సినిమాలు చేస్తూనే ఓ వైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల ‘L2: ఎంపురాన్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం పలు సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో.. నేడు పృథ్వీరాజ్ సుకుమారన్ 43వ పుట్టిన రోజు కావడంతో కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించి అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఆయనకు విషెస్ తెలుపుతూ మూవీ మేకర్స్ టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఇక ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ అమీర్ అలీగా కనిపించబోతున్నారు.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ప్రేక్షకుల్లో భారీ హైప్‌ను క్రియేట్ చేస్తున్నాయి. ‘ఖలీఫా: ది బ్లడ్ లైన్’ (Khalifa: The Bloodline)టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రాన్ని గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో విద్యుత్ జమ్వాల్, సత్యరాజ్, కృతి శెట్టి(Kriti Shetty), ప్రియంవద కృష్ణన్ నటించనున్నారు. ఈ సినిమాకు వైశాఖ్ దర్శకత్వం వహిస్తున్నారు. పృథ్వీరాజ్, వైశాఖ్ కాంబోలో ఇంతకు ముందే ఓ మూవీ వచ్చింది. ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత మరోసారి ఓ భారీ ప్రాజెక్ట్ రానుంది. 2010లో ‘పోక్కిరి రాజా’తో అలరించిన వీరిద్దరూ కలిసి ఈ మూవీ కోసం పనిచేస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఓనమ్ పండుగ సందర్భంగా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కాబోతుంది.






