నాకంటే ప్రభాస్, మహేశ్ బాబు చాలా పెద్ద హీరోలు.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

by Javid Pasha |   (  Updated:2023-06-21 16:00:06  IST  )

వారాహి యాత్రలో భాగంగా కోనసీమలో పర్యటిస్తున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

నాకంటే ప్రభాస్, మహేశ్ బాబు చాలా పెద్ద హీరోలు.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: వారాహి యాత్రలో భాగంగా కోనసీమలో పర్యటిస్తున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకంటే ప్రభాస్, మహేశ్ బాబు చాలా పెద్ద హీరోలు అని అన్నారు. వీళ్లతో పాటు రామ్ చరణ్, అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా హీరోలని అన్నారు. తనకంటే వాళ్ల రెమ్యునరేషన్ కూడా చాలా ఎక్కువేనని చెప్పారు. వాళ్లు తనకంటే చాలా పెద్ద స్టార్లు చెప్పుకోవడానికి తనకు ఏమాత్రం అభ్యంతరం లేదని, ఉన్న విషయమే చెబుతున్నానని పవన్ స్పష్టం చేశారు. అయితే రాజకీయాల్లో మాత్రం వాళ్లందరి కంటే తనకే ఎక్కువ అవగాహన ఉందని, ఈ క్రమంలోనే రాష్ట్రాభివృద్ధి కోసం వారంతా కలిసి రావాలని పవన్ పిలుపునిచ్చారు.

ఇక వైసీపీ ప్రభుత్వంపై జనసేన చీఫ్ విరుచుకుపడ్డారు. ఏపీలో ఉప్మా ప్రభుత్వం నడుస్తోందని ఎద్దేవా చేశారు. ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టి కేసుల నుంచి బయటపడటానికి సీఎం జగన్ ఢిల్లీలోని నేతల చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు 6 కోట్ల మందిని దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేనకు పట్టం కట్టాలని పవన్ కల్యాణ్ కోరారు.

ఇవి కూడా చదవండి :

వచ్చే ఎన్నికల్లో తాను ఓడిపోతానన్న పవన్ కల్యాణ్.. షాక్ లో జనసేన కార్యకర్తలు!

Next Story