మెగాస్టార్ గాడ్‌ఫాదర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌‌కు పవర్ స్టార్

by Disha Web Desk 7 |
మెగాస్టార్ గాడ్‌ఫాదర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌‌కు పవర్ స్టార్
X

దిశ, సినిమా : మెగాస్టార్ చిరంజీవి అప్‌కమింగ్ ఫిల్మ్ 'గాడ్‌ఫాదర్'. అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ ఇటీవలే విడుదలైంది. ఇందులో చిరు లుక్స్‌తో పాటు డైలాగ్స్‌ ప్రాజెక్ట్‌పై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇక మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే రిలీజ్ డేట్ ప్రకటించినప్పటికీ ఊహించినంత హైప్ రాకపోవడంతో ఈ నెలాఖరున ప్రీరిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేశారు మేకర్స్. ఈ వేడుకకు సల్మాన్ ఖాన్ ఎలాగో వస్తాడు కాబట్టి మరో స్పెషల్ గెస్ట్‌గా పవన్ కళ్యాణ్ వస్తే సినిమాకు క్రేజ్ పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్‌ను గెస్ట్‌గా పిలవాలని చిరు ఫిక్స్ అయినట్లు సమాచారం. ఇక అదే వేదికపై ట్రైలర్ రిలీజ్ చేసే అవకాశముండగా.. ముంబైలో కూడా హిందీ వెర్షన్ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. కాగా అక్కడ బిగ్ బీ అమితాబ్‌ను స్పెషల్ గెస్ట్‌గా ఆహ్వానించాలని చిరు అనుకుంటున్నట్లుగా వినికిడి.

Also Read : మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఒకే వేదికపై పవర్ స్టార్, మెగాస్టార్?

Also Read : Pawan Kalyan బర్త్ డే రోజు ఈ ట్వీట్ చూశారా?


BIGG BOSS వాయిస్ ఎవరిదో తెలుసా ?

Next Story

Most Viewed